అర్ధరాత్రి సంచరిస్తే చర్యలు

ABN, Publish Date - Apr 03 , 2025 | 11:55 PM

నగర పరిధిలో ఎటువంటి కార ణం లేకుండా అర్ధరాత్రులు బహిరంగంగా తిరిగే వారిపై కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

అర్ధరాత్రి సంచరిస్తే చర్యలు

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): నగర పరిధిలో ఎటువంటి కార ణం లేకుండా అర్ధరాత్రులు బహిరంగంగా తిరిగే వారిపై కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. నేర నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి సమయాల్లో గస్తీ, పెట్రోలింగ్‌ నిర్వహించే సమయాల్లో సరైన కారణాలు లేకుండా రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌ పరిధిలో రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌తో పాటు, నగరంలోని ప్రధాన కూడళ్లలో నిరంతర తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి 11 గంటల తర్వాత వ్యాపారాలు, దుకాణాలు, టిఫిన్‌ బండ్లు మూసివేయా లని, అనుమతులు లేకుండా వ్యాపారాలు సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

Updated Date - Apr 03 , 2025 | 11:55 PM