అడుగంటి‘నది’
ABN, Publish Date - Mar 13 , 2025 | 12:18 AM
మహేంద్రతనయ.. ఒడిశాతో పాటు ఏపీ గ్రామాల తాగు, సాగునీటికి జీవనాధారం. ఒడిశాలో వర్షాలు కురిస్తేనే ఈ నదికి జలకళ. వేసవిలోనూ ప్రవాహం ఉంటుంది. ఈసారి మాత్రం ఎగువన వర్షాలు అంతంత మాత్రమే. దీనికితోడు వచ్చే అరకొర నీటికి ఒడిశా వాసులు అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో ఏపీలో నది అడుగంటి పోయింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీంతో నది పరీవాహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెళియాపుట్టి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) మార్చి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. దీనికితోడు మహేంద్రతనయ నది అడుగంటు తుండడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఎగువ భాగంలో ఒడిశా వైపు అక్కడి ప్రజలు బావు షోలా, బిన్నాళ, గురండి తదితర చోట్ల నదికి అడ్డుగా ఇసుక బస్తాలు వేసి నీటిని నిలుపుదల చేయటంతో మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు తీవ్ర నీటిఎద్దడి నెలకొనే ముప్పు పొంచి ఉంది. ఒడిశా భూభాగంలోని మహేంద్రగిరుల్లో పుట్టిన నది మూడు పాయలుగా విడి పోయింది. ఒకపాయ గజపతి జిల్లా కేంద్రం పర్లాఖిమిడి మీదుగా మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి గోట్టా బ్యారేజీలో కలుస్తుంది. అయితే చాపర నుంచి రట్ణిణి వరకు ఏపీ పరిధిలో నది ఉంది. అక్కడి నుంచి నది ఎడమవైపు ఏపీ గ్రామాలు కాగా.. కుడివైపు ఒడిశాలోని అమర, దాలింపురం, కేరండి, రామసాగరం తదితర గ్రామాలు ఉన్నాయి. దీంతోపాటు గజపతి జిల్లా పర్లాఖిమిడి సమీపంలో ఇసుక మూటలు అడ్డువేసి పాతపట్నంతోపాటు దిగువ ప్రాంతాలకు నీరు రాకుండా చేస్తున్నారు. మహేంద్ర తనయలోని బోర్ల ద్వారా నది పరిసర గ్రామాలకు తాగునీరు అందుతోంది. నది అడుగంటి పోవడంతో ఏపీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు నది సమీపంలోనే ఉన్న ఇటుకల పరిశ్రమ లకు నీరు అధికంగా వాడుతున్నారు. అధికమైన ఆక్రమణలు.. మహేంద్రతన నదికి ఇరువైపులా కొంతమంది ఆక్రమించుకుని పొలాలు తయారు చేసుకున్నారు. దీంతో నది వెడల్పు రానురాను తగ్గుతోంది. గడచిన ఐదేళ్లుగా ఇసుక కోసం కూడా అక్రమంగా తవ్వడం వల్ల భూగర్భ జ లాలు అడుగంటి పోయాయి. ఆర్‌బ్ల్యూ ఎస్ అధికారులు తాగునీటికి ఇబ్బందు లు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పరివాహక గ్రామాల ప్రజల్లో ఆందోళన రాష్ట్రంలోని చాపర, మెళియాపుట్టి, రట్టిణి, వసుందర, నడసందర, సరాళి, సంగుడి, పాతపట్నం, గోపాలపురం, కాగువాడ, భూరగాం, పెద్దసీది, తీమర, తామర, హిరమండలంలోని ధనుపురం, అవలంగి గ్రామాలకు తాగునీటి పంపుహౌస్‌లు నదిలో ఉన్నాయి. మెళియాపుట్టి వద్ద బోరు ఏర్పాటు చేసి అక్కడి నుంచి చాపర, పట్టుపురం, శేఖరాపురం, పెద్దలక్ష్మీపురం గ్రామ పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తారు. అయితే ఈఏడాది మార్చి నెలలోనే నది అడుగంటి పోతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు.. మహేంద్రతనయ నదిలో మార్చి నాటికే నీరు లేకపోవటం ఈ ఏడాదే చూస్తున్నాం. ఈసారి నదిపక్కన పొలంలో పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేశాము. ఇప్పుడు నదిలో నీరులేక నష్టపోవాల్సి వస్తోంది. ఒడిశాలో ఎగువన అడ్డుకట్ట వేయడం వల్ల ఉన్ననీరు కూడా కిందకు రావడం లేదు. -సోనాపురం అగ్గిన్న, కోసమాళ రైతు తాగునీటికి ఇబ్బందులు తప్పవు.. మహేంద్రతన నదిలో నీటి నిల్వలు అడుగంటి పోయాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎప్పుడూ మే నెల ఆఖరులో ఇలాంటి పరిస్థితులు కనిపించేవి. ఈఏడాది మార్చిలోనే కష్టాలు వస్తున్నాయి. -బసవ పరమేష్‌రెడ్డి, మెళియాపుట్టి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాం.. నదిలో ఉన్న తాగునీటి పథకాల నుంచి ఇప్పుడైతే నీరు వస్తోంది. అయితే నదిలో ఒడిశా రైతులు పాతపట్నం వద్ద అడ్డుకట్ట వేయడంతో నీరు రావడం లేదు. ఒడిశా అధికారులతో మాట్లాడి అడ్డకట్టలను తొలగించాలని కోరుతాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాము. -ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి మార్చి ఆరంభంలోనే అడుగంటిన మహేంద్రతనయ నది

మహేంద్రతనయ.. ఒడిశాతో పాటు ఏపీ గ్రామాల తాగు, సాగునీటికి జీవనాధారం. ఒడిశాలో వర్షాలు కురిస్తేనే ఈ నదికి జలకళ. వేసవిలోనూ ప్రవాహం ఉంటుంది. ఈసారి మాత్రం ఎగువన వర్షాలు అంతంత మాత్రమే. దీనికితోడు వచ్చే అరకొర నీటికి ఒడిశా వాసులు అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో ఏపీలో నది అడుగంటి పోయింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీంతో నది పరీవాహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మెళియాపుట్టి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి)
మార్చి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. దీనికితోడు మహేంద్రతనయ నది అడుగంటు తుండడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఎగువ భాగంలో ఒడిశా వైపు అక్కడి ప్రజలు బావు షోలా, బిన్నాళ, గురండి తదితర చోట్ల నదికి అడ్డుగా ఇసుక బస్తాలు వేసి నీటిని నిలుపుదల చేయటంతో మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు తీవ్ర నీటిఎద్దడి నెలకొనే ముప్పు పొంచి ఉంది. ఒడిశా భూభాగంలోని మహేంద్రగిరుల్లో పుట్టిన నది మూడు పాయలుగా విడి పోయింది. ఒకపాయ గజపతి జిల్లా కేంద్రం పర్లాఖిమిడి మీదుగా మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం వరకు వెళ్తుంది. అక్కడి నుంచి గోట్టా బ్యారేజీలో కలుస్తుంది. అయితే చాపర నుంచి రట్ణిణి వరకు ఏపీ పరిధిలో నది ఉంది. అక్కడి నుంచి నది ఎడమవైపు ఏపీ గ్రామాలు కాగా.. కుడివైపు ఒడిశాలోని అమర, దాలింపురం, కేరండి, రామసాగరం తదితర గ్రామాలు ఉన్నాయి. దీంతోపాటు గజపతి జిల్లా పర్లాఖిమిడి సమీపంలో ఇసుక మూటలు అడ్డువేసి పాతపట్నంతోపాటు దిగువ ప్రాంతాలకు నీరు రాకుండా చేస్తున్నారు. మహేంద్ర తనయలోని బోర్ల ద్వారా నది పరిసర గ్రామాలకు తాగునీరు అందుతోంది. నది అడుగంటి పోవడంతో ఏపీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు నది సమీపంలోనే ఉన్న ఇటుకల పరిశ్రమ లకు నీరు అధికంగా వాడుతున్నారు.
అధికమైన ఆక్రమణలు..
మహేంద్రతన నదికి ఇరువైపులా కొంతమంది ఆక్రమించుకుని పొలాలు తయారు చేసుకున్నారు. దీంతో నది వెడల్పు రానురాను తగ్గుతోంది. గడచిన ఐదేళ్లుగా ఇసుక కోసం కూడా అక్రమంగా తవ్వడం వల్ల భూగర్భ జ లాలు అడుగంటి పోయాయి. ఆర్‌బ్ల్యూ ఎస్ అధికారులు తాగునీటికి ఇబ్బందు లు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పరివాహక గ్రామాల ప్రజల్లో ఆందోళన
రాష్ట్రంలోని చాపర, మెళియాపుట్టి, రట్టిణి, వసుందర, నడసందర, సరాళి, సంగుడి, పాతపట్నం, గోపాలపురం, కాగువాడ, భూరగాం, పెద్దసీది, తీమర, తామర, హిరమండలంలోని ధనుపురం, అవలంగి గ్రామాలకు తాగునీటి పంపుహౌస్‌లు నదిలో ఉన్నాయి. మెళియాపుట్టి వద్ద బోరు ఏర్పాటు చేసి అక్కడి నుంచి చాపర, పట్టుపురం, శేఖరాపురం, పెద్దలక్ష్మీపురం గ్రామ పంచాయతీలకు తాగునీరు సరఫరా చేస్తారు. అయితే ఈఏడాది మార్చి నెలలోనే నది అడుగంటి పోతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు అందోళన చెందుతున్నారు.
ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు..
మహేంద్రతనయ నదిలో మార్చి నాటికే నీరు లేకపోవటం ఈ ఏడాదే చూస్తున్నాం. ఈసారి నదిపక్కన పొలంలో పొద్దుతిరుగుడు, జొన్న పంటలు వేశాము. ఇప్పుడు నదిలో నీరులేక నష్టపోవాల్సి వస్తోంది. ఒడిశాలో ఎగువన అడ్డుకట్ట వేయడం వల్ల ఉన్ననీరు కూడా కిందకు రావడం లేదు.
-సోనాపురం అగ్గిన్న, కోసమాళ రైతు
తాగునీటికి ఇబ్బందులు తప్పవు..
మహేంద్రతన నదిలో నీటి నిల్వలు అడుగంటి పోయాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఎప్పుడూ మే నెల ఆఖరులో ఇలాంటి పరిస్థితులు కనిపించేవి. ఈఏడాది మార్చిలోనే కష్టాలు వస్తున్నాయి.
-బసవ పరమేష్‌రెడ్డి, మెళియాపుట్టి
తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాం..
నదిలో ఉన్న తాగునీటి పథకాల నుంచి ఇప్పుడైతే నీరు వస్తోంది. అయితే నదిలో ఒడిశా రైతులు పాతపట్నం వద్ద అడ్డుకట్ట వేయడంతో నీరు రావడం లేదు. ఒడిశా అధికారులతో మాట్లాడి అడ్డకట్టలను తొలగించాలని కోరుతాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాము.
-ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి
Updated Date - Mar 13 , 2025 | 12:19 AM