కళలు చరిత్రకు సాక్ష్యాలు

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:50 PM

కళలు భవిష్య త్తు తరాలకు అందించే చరిత్ర కు సాక్ష్యాలుగా నిలుస్తాయని కేంద్రమంత్రి కింజరాపు రా మ్మోహన్‌నాయుడు అన్నారు.

కళలు చరిత్రకు సాక్ష్యాలు
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • కేంద్రమంత్రి రామ్మోహన్‌

ఆమదాలవలస, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): కళలు భవిష్య త్తు తరాలకు అందించే చరిత్ర కు సాక్ష్యాలుగా నిలుస్తాయని కేంద్రమంత్రి కింజరాపు రా మ్మోహన్‌నాయుడు అన్నారు. పట్టణంలోని పాలపోలమ్మ గుడి ఆవరణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో భాగంగా మూడో రోజు ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న నాట క రంగానికి ఆమదాలవలస రంగస్థల కళాకారుల సంఘం జీవం పోసిందని, ఈ సందర్భంగా ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తమ్మినేని విద్యాసాగర్‌, పేడాడ ప్రతాప్‌కుమార్‌తోపాటు ప్రతి నిధులను అభినందించారు. ఆమదావలసలో ఆడిటోరియం నిర్మించి ప్రజలకు అందిస్తానన్నా రు. ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. కళలను ప్రోత్సహించడం అంటే మన సంప్ర దాయాన్ని పరిరక్షించుకోవడమేనన్నారు. కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత, మున్సిపల్‌ కమిషనర్‌ పూజారి బాలాజీ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు మూడు నాటికలు ప్రదర్శించారు.

Updated Date - Feb 09 , 2025 | 11:50 PM