ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసమానతలు ఉన్నంత వరకూ ఉద్యమాలు

ABN, Publish Date - Apr 14 , 2025 | 12:22 AM

అస మానతలు ఉన్నంతవరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని, కగార్‌ పేరుతో మావో యిస్టుల నిర్మూలన అసాధ్యమని న్యూ డెమో క్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంక టేశ్వరరావు అన్నారు.

మాట్లాడుతున్న సాధినేని వెంకటేశ్వరరావు

కాశీబుగ్గ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): అస మానతలు ఉన్నంతవరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని, కగార్‌ పేరుతో మావో యిస్టుల నిర్మూలన అసాధ్యమని న్యూ డెమో క్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంక టేశ్వరరావు అన్నారు. ఆదివారం కాశీబుగ్గలో గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధు డు, సీపీఐన్యూడెమోక్రసీ నేత పైల వాసు దేవరావు 15వ వర్ధంతి సభ నిర్వహిం చారు. పైల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రశ్నించే వాళ్లను చిత్ర హింసలు పెట్టి, ఇంకా ఎదురు తిరిగితే ఎన్‌కౌంటర్‌ చేస్తుండడం దారుణమన్నారు. ఆదివాసీలపై ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్ప డుతోందని, పాలకులు కార్పొరేట్లకు వత్తాసు పలుకు తున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పైల వాసుదేవరావు బలిదానం వృథా కాదని, శ్రీకాకుళం మట్టికి ఆ శక్తి ఉంద న్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌ ప్రజలకు ఉపయోగ పడాలని, అలా కాకుండా నిరు ద్యోగం పెంచేలా ఉంటే పిడికిలి బిగించాల్సిం దేనన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమా ఖ్య కళాకారులు విప్లవ గీతాలాపన, నతృ ప్రదర్శనలు చేశారు. అంతకుముందు వామ పక్ష నేతలు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, కమిటీ సభ్యులు కొండయ్య, వెంక టేశ్వరరావు, పి.రమణి, రాజశేఖర్‌, వినోద్‌, బాలకృష్ణ, మాధవరావు, శ్రీనివాస్‌ రావు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:22 AM