ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెక్‌పోస్ట్‌ వద్ద అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:49 AM

మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కాకుండా పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ కమిషనర్‌

ఇచ్ఛాపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కాకుండా పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సరిహద్దు చెక్‌పోస్టును కమిషనర్‌తో పాటు జిల్లా ప్రొబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి సీహెచ్‌ తిరుపతి నాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి ఒడిశాకు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ముఖ్యంగా రాత్రిపూట అప్రమత్తంగా ఉండి వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు. గంజాయి, ఒడిశా నాటు సారా అక్రమ రవాణాపై ప్రత్యేక దృిష్టి సారించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్నారు. ఒడిశా నుంచి వచ్చిన వాహనాలను కమిషనర్‌ దగ్గరుండి సిబ్బందితో తనిఖీలు చేయించారు. అనంతరం ఇచ్ఛాపురం ప్రొబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కార్యాలయాన్ని సందర్శించి... రికార్డులు పరిశీలించారు. కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించినా.. నాటుసారా, ఒడిశా మద్యం, గంజాయికి అడ్డుకట్ట వేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.దుర్గాప్రసాద్‌, మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీ ఇన్‌స్పెక్టర్‌ జీవీ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:49 AM