Better medical services మెరుగైన వైద్య సేవలందించాలి: ఎమ్మెల్యే గౌతు శిరీష

ABN, Publish Date - Apr 04 , 2025 | 11:50 PM

Better medical services అన్ని వేళ లా రోగులకు మెరుగైన, అత్యవసర వైద్య సేవ లు అందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

Better medical services  మెరుగైన వైద్య సేవలందించాలి: ఎమ్మెల్యే గౌతు శిరీష
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

హరిపురం ఏప్రిల్‌4 (ఆంధ్రజ్యోతి): అన్ని వేళ లా రోగులకు మెరుగైన, అత్యవసర వైద్య సేవ లు అందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక సామాజిక ఆసు పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి మానవతా దృక్ప థంతో సేవలందించాలని కోరారు. ఆసుపత్రి సమస్యలను సూపరింటెండెంట్‌ యు. స్వరాజ్యలక్ష్మిని అడిగి తెలుసుకు న్నారు. అనంతరం కమిటీ సభ్యులుగా యేర్పుల జోగారావు, సాలిన భీమారావు, మల్లేన సుశీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్ర మంలో వైద్యులు జోగినాయుడు, ఐశ్వర్య, షన్ముఖరాజు, జ్ఞానేశ్వరి, టీడీపీ నాయ కులు బావన దుర్యోధన, దాసరి తాతారావు, రట్టి లింగరాజు, బైరిశెట్టి గున్న య్య, పుల్లా వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:51 PM