Child protection బాలలకు రక్షణ కవచంలా ఉండాలి
ABN, Publish Date - Mar 18 , 2025 | 11:45 PM
Child protection బాలలు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉన్నారని, వారికి అన్ని విధాలా రక్షణ కవచంలా ఉండే బాధ్యత సచివాలయ మహిళా పోలీసులు తీసుకోవాలని బాలల రక్షణ పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు.

ఆ బాధ్యత సచివాలయ మహిళా పోలీసులదే..
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు
పలాస, మార్చి 18(ఆంధ్రజ్యోతి): బాలలు ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉన్నారని, వారికి అన్ని విధాలా రక్షణ కవచంలా ఉండే బాధ్యత సచివాలయ మహిళా పోలీసులు తీసుకోవాలని బాలల రక్షణ పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. మునిసిపల్ కార్యాలయం లో మంగళవారం మహిళా పోలీసులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల పర్యవేక్షణ కష్టంగా మా రిందని, తల్లిదండ్రులు, గురువుల మాటలను సైతం వారు వినడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఏ అసాంఘిక కార్యక లాపాలు జరిగినా అందులో బాలలుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడిన పిల్లలు విలువైన తమ విలువైన బాల్యాన్ని కోల్పోతున్నార ని ఉదహరిం చారు. బాల్య వివాహాల నిరోధానికి అవసర మైన చర్యలు చేపట్టాలన్నారు. మునిసి పల్ కమిషనర్ ఎన్.రామారావు అధ్యక్షతన వహిం చిన కార్యక్రమంలో జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, కాశీబుగ్గ సీఐ పి.సూర్య నారాయణ, అసిస్టెంట్ లేబర్ అధికారి ఎం.వి జయకుమార్, ఐసీడీఎస్ సీడీపీవో కె.పార్వతి, సూపర్‌వైజర్ యు.లత, చైల్డ్‌హెల్ప్‌లైన్ సమన్వయకర్త కె.శివాజీ, కర్మాగారాలశాఖ సీనియర్ సహాయకుడు ఆర్.శ్రీనివాసరావు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Mar 18 , 2025 | 11:45 PM