development అభివృద్ధిపథంలో నియోజకవర్గం: శిరీష
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:53 PM
development తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని, వారి ఆశలను వమ్ముచేయనని ఎమ్మె ల్యే గౌతు శిరీష అన్నారు.
రూ.లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం
పలాస/వజ్రపుకొత్తూరు/హరిపురం/పలాస రూరల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని, వారి ఆశలను వమ్ముచేయనని ఎమ్మె ల్యే గౌతు శిరీష అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమ యంలో అత్యధిక మెజార్టీ ఇచ్చే వార్డులు, గ్రామాలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందిస్తానని ఇచ్చిన హామీని ఆమె నిలబెట్టుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో సోమవారం పలాస మునిసిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావుతో వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు, మందస మండలం నారాయణపురం, పలాస మండలం లక్ష్మీపురం పంచాయతీల నేతలకు ప్రోత్సాహక నగదును అందజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడుపుదామన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈనెల 22న రక్తదాన శిబిరంలో 1000 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, కార్యకర్తలు లక్ష్యం చేరువకు సహకరిం చాలని కోరారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు, ఆ పార్టీ నేతలు లొడగల కామేశ్వరరావు యా దవ్, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్య నారాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, దువ్వాడ సంతోష్, వసంతరావు, సూరాడ మోహనరావు, కర్ని రమణ, బావన దుర్యోధన, దాసరి తాతారావు, జీకే నాయుడు, రట్టి లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 11:53 PM