ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRAU బీఆర్‌ఏయూలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సేవలు నిలుపుదల

ABN, Publish Date - Jan 01 , 2025 | 01:05 AM

BRAU డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ యూనివర్సిటీలో గతేడాది డిసెంబరులో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించిన 34 మంది ఉద్యోగుల సేవలను వర్సి టీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూని

ఎచ్చెర్ల, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ యూనివర్సిటీలో గతేడాది డిసెంబరులో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించిన 34 మంది ఉద్యోగుల సేవలను వర్సి టీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు. 2023 డిసెంబరు 31న అప్పటి వీసీ హయాంలో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో బోధనేతర సిబ్బందిని నియమించారు. ఏడాది కాలపరిమితికి వీరికి నియమించడంతో 2024 డిసెంబరు 31 నాటికి ఒప్పందం పూర్తయింది. వాస్తవానికి తాడేపల్లికి చెందిన ఓ సంస్థతో, వర్సిటీ అధికారులు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుని వీరిని నియమించారు. ఏడాది ఒప్పందం డిసెంబరు 31వ తేదీతో ముగుస్తుండడంతో ఈ నెల 23న వర్సిటీ అధికారులు తాడేపల్లికి చెందిన ఆ ఏజెన్సీకి లేఖకూడా రాశారు. కాగా, మంగళవారం విధులకు హాజరైన ఈ సిబ్బందికి బుధవారం నుంచి విధులకు హాజరుకానక్కర్లేదని తెలియడంతో ఒక్కసారి ఖంగుతిన్నారు. వర్సిటీ అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించుకుని ఉద్యోగాల్లో కొనసాగిం చేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు ప్రయత్నించారు. నూతన సంవత్సరం వేడుక వేళ వీరి సేవలను నిలుపుదల చేయడంతో వీరంతా తీవ్ర ఆందోళన గురయ్యారు. వర్సిటీ అధికారులు పునరాలోచన చేసి తమను విధుల్లో కొనసాగించాలని వారంతా కోరుతున్నారు. ఈ విషయమై వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజనితో ప్రస్తావించగా.. ఏడాది కాలపరిమితికి వీరిని నియమించారని, ఈ ఒప్పందం ముగియడంతో వీరి సేవలను నిలుపుదల చేసినట్టు చెప్పారు. పాలకమండలి సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Jan 01 , 2025 | 01:05 AM