ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tablets: మందుల్లేవ్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:15 AM

No medication పేరుకే జిల్లా కేంద్రాసుపత్రి. ఇక్కడ పూర్తిస్థాయిలో మందులు ఉండవు. వంద పడకల ఏరియా ఆసుపత్రి నుంచి 200 పడకల జిల్లా కేంద్రాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయినా.. మందుల కేటాయింపునకు బడ్జెట్‌ నామమాత్రమే. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.

జిల్లా కేంద్ర ఆసుపత్రి

  • - జిల్లా కేంద్రాసుపత్రికి చాలీచాలని బడ్జెట్‌

  • - రోగులకు తప్పని ఇబ్బందులు

  • టెక్కలి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పేరుకే జిల్లా కేంద్రాసుపత్రి. ఇక్కడ పూర్తిస్థాయిలో మందులు ఉండవు. వంద పడకల ఏరియా ఆసుపత్రి నుంచి 200 పడకల జిల్లా కేంద్రాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయినా.. మందుల కేటాయింపునకు బడ్జెట్‌ నామమాత్రమే. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలో దుస్థితి. ఈ ఆస్పత్రికి రోజుకి 600 నుంచి 700 మంది ఔట్‌పేషెంట్లు, ప్రతిరోజూ 30 మందికి తగ్గకుండా ఇన్‌పేషెంట్లు ఉంటారు. సోమవారం అదనంగా మరో వందమంది ఓపీ రోగుల సంఖ్య పెరుగుతుంది. రోగుల తాకిడికి తగ్గట్టు ఇక్కడ మందులు దొరకడం లేదు. అవసరమైన మందుల కోసం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌కి ఇండెంట్‌ పెట్టినా.. వారి దగ్గర ఆ మందులు లేవంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో వైద్యులు కొన్ని సందర్భాల్లో రోగులకు అత్యవసర పరిస్థితులను బట్టి బయట లభ్యమయ్యే మందులు రాయాల్సిన పరిస్థితి దాపురించింది.

  • జిల్లా కేంద్రాసుపత్రిలో కొన్నిరకాల మందుల కొరత ఏర్పడింది. యాంటీబయాటిక్‌కు సంబంధించిన యాంటిసిలిన్‌, జంటామైసిన్‌ వంటి ఇంజక్షన్లు, ఫిట్స్‌కు సంబంధించిన ఫినోటోయిన్‌ ఇంజక్షన్‌, విటమిన్‌-కేకు సంబంధించిన ఇంజక్షన్‌, గర్భిణులు, హైబీపీ వచ్చే వారికి అత్యవసరంగా వచ్చే లేబిట్‌లాల్‌ వంటి ఇంజక్షన్లు అందుబాటులో లేవు. ఇక కాలిన గాయాలకు వాడే సిల్వర్‌ ఎక్స్‌ ఆయింట్మెంట్‌, కిడ్నీ రోగులకు అవసరమయ్యే లాసిక్స్‌ మాత్రలు, డయేరియా(విరోచనాలు), ఫిరిజోలోడాన్‌, చలికాలంలో ఆయాసం రోగులకు ఇచ్చే ఆప్తాలిన్‌, బీపీకి సంబంధించిన ఎటెన్‌లాల్‌, ఎంలోడిఫిన్‌ వంటి మాత్రలు లేవు. యాంటీబయాటిక్‌కు సంబంధించిన సెఫిక్‌లైన్‌, ఎమాక్సిలిన్‌, పరగడుపున ఇచ్చే పాంటాప్‌, జ్వరానికి ఇచ్చే పారాసిట్మల్‌ 500ఎంజీ మాత్రలు కూడా లేని పరిస్థితి నెలకొంది.

  • ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి జిల్లా సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్స్‌కు, అక్కడ నుంచి జిల్లా కేంద్రాసుపత్రికి ప్రతి మూడు నెలలకోసారి మందులు సరఫరా అవుతుంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీఎంఎస్‌ఐడీసీకి సుమారు 300 రకాలకుపైగా మందులు నిలిపేసింది. దీంతో మందుల కొరత అనివార్యమైంది. ఆయా ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రాస్పత్రులు పలు రకాల మందులు ఇండెంట్‌ పెట్టినా సుమారు 16 రకాల మందులు ఇవ్వలేమని ఇప్పటికే సెంట్రల్‌డ్రగ్‌ స్టోర్స్‌ చేతులెత్తేసింది.

  • జిల్లా కేంద్రాసుపత్రికి 2024-25 విడతల వారీగా బడ్జెట్‌ పరిశీలిస్తే.. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొదటివిడత రూ.13.10లక్షలు, జూలై నుంచి సెప్టెంబరు వరకు రెండో విడత రూ.15.74 లక్షలు, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడో విడత రూ.19.83 లక్షలు, జనవరి నుంచి మార్చి వరకు నాలుగో విడత రూ.31.10 లక్షలు వరకు కేటాయించారు. చాలీచాలని బడ్జెట్‌తో రోగులకు అరకొర మందుల సరఫరా జరుగుతోంది. మందులకు అదనపు బడ్జెట్‌ కేటాయించాలని పలువురు కోరుతున్నారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బొడ్డేపల్లి సూర్యారావు వద్ద ప్రస్తావించగా ఉన్న మేరకు రోగులకు మందులు అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన మందులు కొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామన్నారు. మందులు కొరత అంశాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకెండరీ హెల్త్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 12:15 AM