దీవించమ్మా.. మహాలక్ష్మమ్మ
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:52 PM
కమ్మసిగడాం మహాలక్ష్మి తల్లి జాతర చివరి రోజు ఆదివారం అంబరా న్ని తాకింది.

చివరి రోజు జాతరకు పోటెత్తిన భక్తజనం
అమ్మవారిని దర్శించుకున్న ఎంపీలు పురందేశ్వరి, కలిశెట్టి
రణస్థలం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): కమ్మసిగడాం మహాలక్ష్మి తల్లి జాతర చివరి రోజు ఆదివారం అంబరా న్ని తాకింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి తల్లిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. పురందేశ్వరికి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు వీవీ ఎస్‌వీ ప్రసాద్, బంటుపల్లి సర్పంచ్ నడుకుదిటి రజిని ఘన స్వాగతం పలికారు. ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని, మహాలక్ష్మిని దర్శించుకోవడం ఎంతో ఆనందగా ఉందని పురందేశ్వరి అన్నారు.
ధనరాజ తులసమ్మ సంబరం..
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలో ధనరాజ తుల సమ్మతల్లి సం బరం ఆదివా రం ఘనంగా జరిగింది. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు ఘటాలతో వచ్చి మొక్కులు చెల్లించారు. పసుపునీరు, పానకాలతో అమ్మవారికి అభిషేకాలు జరిపారు.
సంతవురిటిలో..
జి.సిగడాం, ఫిబ్రవరి 9(ఆంధ్ర జ్యోతి): సంతవురిటిలొ ఆదివారం రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణం వైభ వంగా జరిగింది. ముం దుగా ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరే గించారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, పరి షత్ రక్షాబంధన, అం కురార్పణ, మండలా రాధన, పతాకప్రతిష్ఠ, మృత్సంగ్రహణం వంటి పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వత్సవలస రాజమ్మ జాతర ప్రారంభం..
గార, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): వత్సవలస రాజమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. తొలివారం అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి రాజ మ్మను దర్శించుకున్నారు. అలాగే శ్రీకూర్మంలో కూర్మ నాథుని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సీఐలు పైడపునాయుడు, బి.ప్రసాదరావు(మెరైన్), ఎస్‌ఐ ఆర్.జనార్దన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. శ్రీకూర్మం క్షేత్రంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది.
Updated Date - Feb 09 , 2025 | 11:52 PM