ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దు
ABN, Publish Date - Apr 03 , 2025 | 12:14 AM
హేతుబద్దత లేని ఎస్పీ వర్గీకరణ చేపట్టొద్దని, రెల్లి గ్రూప్ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్సీ రెల్లికుల జాతీయ జాతీయ కార్యదర్శి పి.సుధాకర్, జిల్లా అధ్యక్షుడు ఏ.కోటి, నగర అధ్యక్షుడు అర్జి ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): హేతుబద్దత లేని ఎస్పీ వర్గీకరణ చేపట్టొద్దని, రెల్లి గ్రూప్ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్సీ రెల్లికుల జాతీయ జాతీయ కార్యదర్శి పి.సుధాకర్, జిల్లా అధ్యక్షుడు ఏ.కోటి, నగర అధ్యక్షుడు అర్జి ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుమారు 300 మంది బుధవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీ వర్గీకరణలో వెనుకబాటు తనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన ఆదేశాలు, సూచనలు అమలు చేయాలని కోరుతూ డీఆర్వో వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
Updated Date - Apr 03 , 2025 | 12:14 AM