Elephants వసప వద్ద ఏనుగుల తిష్ఠ

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:12 AM

Elephants కొత్తూరు మండలం వసప, కుంటిబద్ద గ్రామాల్లోని తోటల్లో నాలుగు ఏనుగులు కనిపించడంతో ప్రజలు భయంధోళన చెందుతున్నారు.

Elephants  వసప వద్ద ఏనుగుల తిష్ఠ
వసప తంపర భూముల్లో సంచరిస్తున్న ఏనుగులు

కొత్తూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండలం వసప, కుంటిబద్ద గ్రామాల్లోని తోటల్లో నాలుగు ఏనుగులు కనిపించడంతో ప్రజలు భయంధోళన చెందుతున్నారు. రెండు రోజులు కిందట మన్యం జిల్లా భామిని మండలం కీసర, కొసర గ్రామాల నదీ పరివాహక ప్రాంతం నుంచి కడుము తోటల్లో తిష్ఠవేసిన ఏనుగులు గురువారం వసప, కుంటిభద్ర గ్రామాల వ్యవసాయ పొలాలు, తోటల్లో దర్శన మిచ్చాయి. పొలాలకు వెళ్లిన ప్రజలు ఏనుగులను చూసి భయందోళన చెంది పరుగులు తీశారు. తోటల్లో ఏనుగులు ఉండడాన్ని గుర్తించిన రైతులు గ్రామంలో చెప్పడంతో వాటిని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. చెరకు, జొన్నపంట అధికంగా తంపర భూముల్లో ఉండడంతో ఆహారం నిమిత్తం ఏనుగులు అక్కడే తిష్ఠవేశాయని, పంటలకే కా కుండా ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామ ని పాతపట్నం పారెస్టు అధికారి పెద్దిన యశస్వి తెలిపారు. కవ్వింపులకు పాల్పడవద్దన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:12 AM