గౌతు శిరీషపై అసత్య వార్తలు
ABN, Publish Date - Mar 22 , 2025 | 12:21 AM
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై రెండున్నరేళ్ల క్రితం స్థానిక పత్రికల్లో అసత్యవార్తలు ప్ర చురితమయ్యాయి.

2023లో కోర్టును ఆశ్రయించిన టీడీపీ నేత
పత్రిక ఎడిటర్‌కు రూ.2లక్షల జరిమానా విధించిన కోర్టు
శ్రీకాకుళం, మార్చి 21(ఆంధ్రజ్యోతి) పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై రెండున్నరేళ్ల క్రితం స్థానిక పత్రికల్లో అసత్యవార్తలు ప్ర చురితమయ్యాయి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచు రించి.. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ 2023లో విశాఖపట్నం కోర్టులో గౌతు శిరీష కేసు వేశారు. కోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడల్లా తన వాదనలు వినిపించారు. శుక్రవారం విశాఖపట్నం జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పును వెల్లడించారు. గౌతు శిరీషపై తప్పుడు ప్రచారం చేపట్టినందుకుగాను ‘ప్రజాగళం మన చిక్కోలు’ ఎడిటర్, పబ్లిషర్ చిగురువలస జగదీశ్వరరావుకు రూ.2లక్షలు జరినామా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చాన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై వెనకడుగు వేయకుండా కోర్టులో పోరాడి ఎమ్మెల్యే శిరీష విజయం సాధించారు.
Updated Date - Mar 22 , 2025 | 12:21 AM