ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fireworks బాణసంచా పేలి.. వ్యక్తికి గాయాలు

ABN, Publish Date - Jan 01 , 2025 | 11:33 PM

Fireworks బాణసంచా పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఉమా బెహరా బాణసంచా కాల్చారు.

సోంపేట, జనవరి 1(ఆంధ్రజ్యోతి): బాణసంచా పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఉమా బెహరా బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో తన ఎడమ చేతిలోనే ఓ టపాసు పేలిపోయింది. దీంతో చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. విపరీతంగా రక్తశ్రావం కావడంతో స్థానికంగా ప్రథమ చికిత్స తీసుకుని, మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.

సింహం విగ్రహం ధ్వంసం

కనిమెట్ట శివాలయం వద్ద ఘటన

పొందూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కనిమెట్ట శివాలయం ముందున్న సింహం విగ్రహాల్లో ఒక దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు, అర్చకుడు తెలిపిన వివరాలి లా ఉన్నాయి.. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఆలయం ముందు ఉన్న సింహాల విగ్రహాల్లో ఒకటి ధ్వంసమవ్వడాన్ని గుర్తించారు. ఈవిషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పారు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామ పెద్దలు ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. కాగా అత్యంత పురాతన ఆల యాల్లో కనిమెట్ట శివాలయం ఒకటి. ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి దర్శించు కుంటారు. పురాతన ఆలయంలో విగ్రహాల ధ్వంసంతో భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 01 , 2025 | 11:33 PM