డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి: ఎమ్మెల్యే శంకర్
ABN, Publish Date - Apr 02 , 2025 | 12:00 AM
డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్య లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలోని డీసీసీబీకాలనీ పరిసర ప్రాంతాల్లో నగరపాలకసంస్థ కమిషనర్, సచివాలయ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
అరసవల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి):డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్య లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలోని డీసీసీబీకాలనీ పరిసర ప్రాంతాల్లో నగరపాలకసంస్థ కమిషనర్, సచివాలయ సిబ్బందితో కలిసి పరిశీలించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న రెండు, మూడు నెల లల్లో యుద్ధ ప్రాతిపదికన నగరంలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి, ప్రజల కు ఇబ్బందులు లేకుండా చేసి, సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందు కు కృషిచేస్తామని తెలిపారు.
ఫగార ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి):వాడాడలో ఉపాధి పథకం ద్వారా ఏర్పాటు చేయనున్న పశువులు మంచినీటి కుంటలు నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్ భూమి పూజ చేశారు.అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్.రామమోహనరావు, ఏపీవో సంధ్యారాణి, జేఈ నారన్నాయుడు పాల్గొన్నారు.
Updated Date - Apr 02 , 2025 | 12:00 AM