Godadevi Kalyanam ఘనంగా గోదాదేవి కల్యాణం
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:52 PM
Godadevi Kalyanam గడచిన నెలరోజులుగా వైష్ణవ ఆలయాల్లో నిర్వహిం చిన ధనుర్మాసోత్సవాలు సోమవారం గోదా రంగనాథుల కల్యాణంతో ముగిశాయి.
ముగిసిన ధనుర్మాసోత్సవాలు
(ఆంధ్రజ్యోతి బృందం)గడచిన నెలరోజులుగా వైష్ణవ ఆలయాల్లో నిర్వహిం చిన ధనుర్మాసోత్సవాలు సోమవారం గోదా రంగనాథుల కల్యాణంతో ముగిశాయి. నెలరోజుల పాటు ప్రతిరోజూ తెల్లవారు జామున ప్రత్యేక పూజలు, తిరుప్పావై ప్రవచనాలతో పాటు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఉత్సవాల ముగింపు సంద ర్భంగా టెక్కలి, నరసన్నపేట, వజ్రపుకొత్తూరు, మం దస, నందిగాం, ఇచ్ఛాపురం, కవిటి, జి.సిగడాం, జలు మూరు మండలాల్లోని పలు ఆలయాల్లో గోదాదేవి రంగ నాథుల కల్యాణం కమనీయంగా సాగింది. పలువురు భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
Updated Date - Jan 13 , 2025 | 11:52 PM