ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harsh punishments లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు

ABN, Publish Date - Mar 28 , 2025 | 11:51 PM

Harsh punishments లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన శిక్షలు విధించబడతాయని సీనియర్‌ సీవిల్‌ న్యాయాధికారి జె.శ్రీనివాసరావు అన్నారు.

టెక్కలి: మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీనివాసరావు

సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీనివాసరావు

టెక్కలి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన శిక్షలు విధించబడతాయని సీనియర్‌ సీవిల్‌ న్యాయాధికారి జె.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్థానిక మహా త్మాగాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వ హించారు. పిల్లలు లైంగిక నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం, లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని రూపొందించిందన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు దివ్వల వివేకానంద, ప్రిన్సిపాల్‌ సుధారాణి, ఎస్‌ఐ రఘునాథ రావు, న్యాయవాదులు గోవింద్‌, బాలకృష్ణ, ఆనందరావు, శ్రీనివాస్‌, ఎంఈవోలు చిన్నారావు, తులసీరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రలోభాలకు గురికావద్దు

పాతపట్నం, మార్చి 28(ఆంధ్రజ్యోతి):విద్యార్థినులు ప్రలోభాలకు గురికావద్దని స్పెషల్‌ (ప్రొహిబిషన్‌,ఎక్సైజ్‌) జ్యుడీషియల్‌ న్యాయా ధికారి డి.శ్రీభరణి అన్నారు. స్థానిక డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం పోక్సో చట్టంపై అవగాహన కలిగించారు. నేరారోపణ అంశాలు, పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వి.అర్చన, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బీఈ సత్యనారాయణ, న్యాయవాది ఎం.రమణ, ఎస్‌ఐ బి.లావణ్య తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:51 PM