ఇచ్ఛాపురం మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటు
ABN, Publish Date - Mar 29 , 2025 | 11:58 PM
మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్, 7వ వార్డు కౌన్సిలర్ లాభాల స్వర్ణమణిపై అనర్హత వేటు పడింది. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఇచ్ఛాపురం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్, 7వ వార్డు కౌన్సిలర్ లాభాల స్వర్ణమణిపై అనర్హత వేటు పడింది. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. శనివారం చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన మునిసిపల్ సాధారణ సమావేశం జరిగింది, ఆర్టీఐ, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) వ్యవస్థను దుర్విని యోగం చేస్తున్నారని, విధుల నిర్వహణలో విఫలం చెందారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో పురపాలిక చట్టం ప్రకారం ఆమె సభ్యత్వం రద్దు చేస్తూ, అనర్హురాలుగా ప్రకటిస్తూ శనివారం కౌన్సిల్ ఆమోదం కోరారు. దీనికి టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కొందరు ఆమోదం తెలిపారు. ఈ మేరకు వైస్ చైర్‌పర్సన్ స్వర్ణమణిపై అనర్హత వేటు వేస్తున్నట్లు చైర్‌పర్సన్ రాజలక్ష్మి ప్రకటించారు. దీనిపై స్వర్ణమణి మాట్లా డుతూ.. ‘కౌన్సిల్ సమావేశంలో నా అనర్హతకి సంబంధించిన అంశాన్ని టేబుల్ అజెండా గా తీసుకురావడం కుట్రలో భాగమే. నాపై చేసిన అభియోగాలపై సమాధానం చెప్ప టానికి కూడా నాకు అవకాశం ఇవ్వకపోవడం దారుణం. చైర్‌పర్సన్, అధికారులు కుమ్మక్కై నాపై అనర్హత వేటు వేశారు.’ అని ఆరోపించారు.
Updated Date - Mar 29 , 2025 | 11:58 PM