ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amc : పలాస ఏఎంసీ చైర్మన్‌గా మల్లా శ్రీనివాసరావు

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:02 AM

Appointment పలాస వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మల్లా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, నియోజకవర్గసమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరికి వీరవిధేయుడిగా ఉన్న శ్రీనివాసరావును రెండోసారి ఏఎంసీ చైర్మన్‌ పదవి వరించింది.

మల్లా శ్రీనివాసరావు
  • పలాస, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పలాస వ్యవసాయమార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా మల్లా శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, నియోజకవర్గసమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరికి వీరవిధేయుడిగా ఉన్న శ్రీనివాసరావును రెండోసారి ఏఎంసీ చైర్మన్‌ పదవి వరించింది. ఈయన 2015 నుంచి 2020 వరకూ ఏఎంసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రముఖ జీడి వ్యాపారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఈయన రాష్ట్ర టీడీపీ కో ఆర్డినేషన్‌ కమిటీ కార్యదర్శిగా, ఖుర్ధా డివిజన్‌ రైల్వే అభివృద్ధి కమిటీ సభ్యుడిగా పనిచేశారు. దీంతోపాటు అనేక పార్టీ పదవులు పొందారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, యార్లగడ్డ వెంకన్నచౌదరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, మాజీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీకి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఏఎంసీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:02 AM