సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:47 PM
problems స్థానిక సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యమిస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, జనవరి 13: స్థానిక సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యమిస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సోమవారం నిమ్మాడలో గ్రామస్థులతో ఆయన ముచ్చటించారు. స్వగ్రామాల్లో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కింజరాపు హరివరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 11:47 PM