development రహదారులు అభివృద్ధికి చిహ్నాలు: మంత్రి అచ్చెన్న
ABN, Publish Date - Apr 04 , 2025 | 11:52 PM
development గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రూ.1.43 కోట్లతో నిర్మించనున్న టెక్కలి-భగవాన్‌పురం రహదారి పనులకు టెక్కలిలో శంకుస్థాపన చేశారు.

టెక్కలి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రూ.1.43 కోట్లతో నిర్మించనున్న టెక్కలి-భగవాన్‌పురం రహదారి పనులకు టెక్కలిలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కొత్తగా రోడ్డు నిర్మాణం పనులు జరిగాయా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా రోడ్డు విస్తరణ పనులు జరిగాయంటే అది టీడీపీ హయాంలోనే సాధ్యమ న్నారు. అంబేడ్కర్ జంక్షన్ నుంచి తొలుసూరుపల్లి రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరిం చాలన్నారు. ఇప్పటికే ఉపాధి నిధులతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపడుతు న్నామన్నారు. ఇంకా ఎక్కడైనా రోడ్లు అవసరమైనా ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తా మన్నారు. భగవాన్‌పురం నుంచి టెక్కలి వరకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. కార్యక్ర మంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, టీడీపీ నేతలు కింజరాపు హరివరప్రసాద్, బగాది శేషగిరిరావు, పినకాన అజయ్‌కుమార్, ఎల్‌ఎల్ నాయకుడు, హనుమంతు రామకృష్ణ, మట్ట సుందరమ్మ, కోళ్ల లవకుమార్, కోళ్ల కామేసు, లాడి శ్రీనివాస్, దల్లి ప్రసాద్‌రెడ్డి, మామిడి రాము, దోని బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే లక్ష్యం
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి-అమలాపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం లకు నూతనంగా మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను స్థానిక ఆర్టీసీ గ్యారేజ్‌లో శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
రూ.420 కోట్లతో ఇంటింటికి తాగునీరు
సంతబొమ్మాళి/కోటబొమ్మాళి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూ.420 కోట్లు మంజూర య్యాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి చెట్ల తాండ్ర-టెక్కలి, సంతబొమ్మాళి-కోటబొమ్మాళి రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని కొటబొమ్మాళి మండలం కొత్తపేట కొండపైకి తీసుకువచ్చి, అక్కడ ట్యాంక్‌లు కట్టి... కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండ లాల్లో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. రెండేళ్లలో టెక్కలి నియోజక వర్గాన్ని స్వర్ణ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. బోరుభద్ర-నౌపడ, వడ్డితాండ్ర- రావివలస, డీజీపురం-చెట్లతాండ్ర, టెక్కలి రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలో 17వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. కార్యక్ర మంలో ఆర్డీవో కృష్ణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ నేతలు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, ఎల్.ఎల్.నాయుడు, బాడాన వెంకట రమణమ్మ, సర్పంచ్ పంగ అశిరినాయుడు పాల్గొన్నారు.
Updated Date - Apr 04 , 2025 | 11:52 PM