Roja's corruption రోజా అవినీతిపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే కూన
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:06 AM
వైసీపీ అధికా రంలో ఉన్నప్పుడు టీటీడీ దర్శనం టిక్కెట్లు అమ్ముకు న్నట్లు ఆరోపణలు ఉన్న అప్పటి మంత్రి ఆర్‌కే రోజాపై కూటమి ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేశారు.
ఆమదాలవలస, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికా రంలో ఉన్నప్పుడు టీటీడీ దర్శనం టిక్కెట్లు అమ్ముకు న్నట్లు ఆరోపణలు ఉన్న అప్పటి మంత్రి ఆర్‌కే రోజాపై కూటమి ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆ యన పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల క్యూలైన్ లో జరిగిన దురదృష్టకరమైన ఘటనను వైసీపీ నాయకులు రాజకీయం చేయడం సిగ్గు చేటన్నా రు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బాధితులను పరామర్శించ డంతో పాటు పరిహారాన్ని అందించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకు న్నారన్నారు. అదేవిధంగా ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐదేళ్ల వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన కుంభకోణాలపై విచారణ చేపట్టా లని డిమాండ్ చేశారు. ఇటీవల మండలంలోని చిన్నజొన్నవలస గ్రామంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆక్రమణ స్థలాల్లో నివాసం ఉంటున్న గృహాలను తొలగించిన బాధితు లకు సమీప ప్రాంతంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే అందించా రు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నెపు భాస్కరరావు, ఎండ అప్పలనాయుడు, నాగళ్ల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 12:06 AM