ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్కూల్‌ పిల్లల ఆటో బోల్తా

ABN, Publish Date - Apr 07 , 2025 | 11:35 PM

పట్టణ పరిధి సురంగిరాజా కోట సమీపంలో ఓ ఆటో బోల్తాపడిన ఘట నలో ముగ్గురు విద్యా ర్థులు తీవ్రంగా గాయ పడ్డారు.

చిన్నారులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధి సురంగిరాజా కోట సమీపంలో ఓ ఆటో బోల్తాపడిన ఘట నలో ముగ్గురు విద్యా ర్థులు తీవ్రంగా గాయ పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ రాల మేరకు.. సురంగి కోట సమీపంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పురుషోత్తపురం, ఏఎస్‌పేట ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో సోమవారం 15 మంది విద్యార్థు లతో వెళ్తున్న ఆటో కోట సమీ పానికి వచ్చేసరికి ముందున్న లారీని తప్పించే క్రమంలో బోల్తా పడింది. దీంతో పిల్లలంతా అందులో ఇరుక్కున్నారు. అక్కడే ఉన్న కొంతమంది స్పందించి పిల్లలను బయటకు తీశారు. తీవ్రంగా గాయ పడిన ముగ్గురు విద్యార్థులను స్థానిక ప్రభుత్వాసు పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా విరిగి పోయింది. అయితే పరిమితికి మించి చిన్నారులను ఎక్కించడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనఫై పట్టణ ఎస్‌ఐ ముకుం దరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:35 PM