శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా శివప్రసాద్‌

ABN, Publish Date - Mar 27 , 2025 | 11:40 PM

శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తంగి శివ ప్రసాదరావు గెలుపొందారు. గురువారం ఉదయం నుంచి జిల్లా కోర్టు ఆవరణలో బార్‌ అసోసి యేషన్‌ ఎన్నికలు నిర్వహించారు.

శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా శివప్రసాద్‌
శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

గుజరాతీపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తంగి శివ ప్రసాదరావు గెలుపొందారు. గురువారం ఉదయం నుంచి జిల్లా కోర్టు ఆవరణలో బార్‌ అసోసి యేషన్‌ ఎన్నికలు నిర్వహించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇప్పిలి సీతారాజు, జనరల్‌ సెక్రటరీగా పిట్ట దామోదరరావు, లేడీ రిప్ర జెంటేటివ్‌గా వనజాక్షి గెలుపొందారు. ట్రెజరర్‌గా కొమర శంకరరా వు, జాయింట్‌ సెక్రటరీగా ఎం.భవానీ ప్రసాద్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీగా త్రిపురాన వర ప్రసాద్‌, లైబ్రరీ సెక్రటరీగా కె.రమణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా సీనియర్‌ అడ్వకేట్స్‌ టి.రాధాకృష్ణ, ఎన్‌.విజయకుమార్‌ వ్యవహరించారు.

సోంపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా శైలేంద్ర

సోంపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): సోం పేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా న్యాయ వాది జీఎస్‌ శైలేంద్ర ను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. కోర్టు ఆవరణలో గురువారం నిర్వహిం చిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా సిలగాన భాస్క రరావు, కార్యదర్శిగా వజ్జ గోపి, సంయుక్త కార్య దర్శిగా దున్న జోగారావు, కోశాధికారిగా బొడ్డ ధర్మారావును ఎన్నుకున్నారు. వీరికి తోటి న్యా యవాదులు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 27 , 2025 | 11:40 PM