public problem ప్రజా సమస్యలను పరిష్కరించండి
ABN, Publish Date - Apr 13 , 2025 | 01:03 AM
public problem అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథ కాలు అందజేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథ కాలు అందజేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిమ్మాడ లోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను గుర్తించి, పరిశీలించి త్వరితగ తిన పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం లేకుండా అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. సంతబొ మ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దల పాడు గ్రామానికి చెందిన మత్య్సకారులు సముద్ర తీరం లో లంగరు వేసి ఉన్న మరపడవ ధ్వంస మైందని పరిహారం అందించాలని బాధితులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందిం చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్య క్షుడు కింజరాపు హరివర ప్రసాద్, నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 13 , 2025 | 01:03 AM