నువ్వులరేవులో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం
ABN, Publish Date - Mar 31 , 2025 | 11:45 PM
నువ్వలరేవులో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది రోజున బృందావతి మాత ఆల యం వద్ద జెండాను ఎగరవేసి వేడుకలు ప్రారంభించిన గ్రామస్తులు... సోమవారం మరో గ్రామదేవత ఠక్కురాణి ఆలయానికి భారీ ఊరేగింపుగా చేరుకున్నారు.

వజ్రపుకొత్తూరు, మార్చి 31 (ఆంధ్ర జ్యోతి): నువ్వలరేవులో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది రోజున బృందావతి మాత ఆల యం వద్ద జెండాను ఎగరవేసి వేడుకలు ప్రారంభించిన గ్రామస్తులు... సోమవారం మరో గ్రామదేవత ఠక్కురాణి ఆలయానికి భారీ ఊరేగింపుగా చేరుకున్నారు. మువ్వల డొమ్మ, ఘంటోమో నరిదాసులకు అమ్మ వారి వేషాలు వేసి... ఊరేగింపుగా తీసుకు వెళ్ళారు.అమ్మవారికి గుడిలో తీర్థ ప్రసా దాలు సమర్పించిన తరువాత గ్రామంలో పగటి వేషాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్ర మాలు ప్రదర్శించారు. ఏటా గ్రామం లో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించే ముందు మూడు రోజుల పాటు గ్రామదేవతలను కొలుస్తారు. దీనిలో భాగంగా సోమవారం ఠక్కురాణి అమ్మవారి గుడిలో పూజలు చేసినట్లు స్థానికులు చెప్పారు.
పెంటూరులో వినాయక విగ్రహం ప్రతిష్ఠ
నందిగాం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెంటూరులో నిర్మించిన వినాయక మందిరంలో విగ్రహాన్ని సోమవారం ప్రతిష్ఠించారు. స్థానిక కాశీవిశ్వేశ్వ రాలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన కూర్మాపు అప్పారావు, రెయ్యమ్మ దంపతుల ఆధ్వర్యంలో నిర్మించిన మందిరంలో పురోహితులు రేజేటి బోసుబాబు, సహాయకులు ఎం.రమేష్‌శర్మ పర్యవేక్షణలో విశేషపూజలు నిర్వహించారు. మందిర స్థలదాత ఏవీవీ ఠాగూర్ దంపతుల్ని అభినందించారు.
Updated Date - Mar 31 , 2025 | 11:45 PM