ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cashews: ‘టాంజానియా’ జీడిపిక్కలు ముంచేశాయ్‌!

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:02 AM

Tanzania Cashews పలాస జీడి వ్యాపారులను విదేశీ జీడి పిక్కలు నిలువునా ముంచేశాయి. అధిక ధర చెల్లించి టాంజానియా నుంచి దిగుమతి చేసుకున్న జీడి పిక్కలకు స్థానిక మార్కెట్లో ఆ స్థాయిలో ధర కరువైంది. ఫలితంగా వ్యాపారులు బస్తాపై రూ.4వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది.

ఆరబెట్టిన విదేశీ జీడి పిక్కలు

  • అధికధర వెచ్చించి దిగుమతి

  • మార్కెట్లో పడిపోయిన ధరలు

  • బస్తాకు రూ.4వేల వరకు నష్టం

  • లబోదిబోమంటున్న వ్యాపారులు

  • పలాస, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పలాస జీడి వ్యాపారులను విదేశీ జీడి పిక్కలు నిలువునా ముంచేశాయి. అధిక ధర చెల్లించి టాంజానియా నుంచి దిగుమతి చేసుకున్న జీడి పిక్కలకు స్థానిక మార్కెట్లో ఆ స్థాయిలో ధర కరువైంది. ఫలితంగా వ్యాపారులు బస్తాపై రూ.4వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. దేశీయ పిక్కల ధరలు కూడా ఆశాజనకంగా లేవు. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ సంకాంత్రికైనా ధరలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 400 జీడి పరిశ్రమలు ఉన్నాయి. ఏటా పలాస మార్కెట్‌కు టాంజానియా, ఐవిరికోస్ట్‌, ఘన, శ్రీలంకతో పాటు ఆఫ్రికా దేశాల నుంచి జీడి పిక్కలు తక్కువ ధరకు దిగమతి అవుతుంతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకర్లు ఉంటారు. వారి ద్వారా పిక్కలను రప్పించుకోవడం సాధారణం. ఈ క్రమంలో ఇక్కడ ధరలు స్థిరంగా ఉన్న సమయంలో కొందరు వ్యాపారులు టాంజానియా దేశం జీడి పిక్కలకు ఆర్డర్‌ పెట్టారు. టాంజానియా దేశ పిక్కలు బస్తా (80 కిలోలు) రూ.8వేల వరకూ లభిస్తుందని భావించి.. 20వేల టన్నుల వరకూ దిగుమతి చేసుకునేందుకు బ్రోకర్లకు ముందుగానే కొంతమేర నగదు చెల్లించారు. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా ఆ పిక్కలు పలాస వ్యాపారుల వద్దకు వచ్చే సరికి జీఎస్‌టీతో సహా రూ.బస్తా (80 కిలోలు) రూ.17,500 ధర పడింది. అయితే, ప్రస్తుత మార్కెట్‌లో బస్తా ధర రూ.14,500వరకు ఉంది. దీంతో బస్తాకు రూ.3వేల వరకు వ్యాపారులు నష్టపోతున్నారు. జీడి పప్పు ధరలు తగ్గుముఖం పట్టడంతో అదనంగా మరో రూ.వెయ్యి వరకూ నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విదేశీ పిక్కలతో వ్యాపారం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి జీడిపిక్కల ధరలు పెరుగుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానికంగా లభించే జీడి పిక్కల ధర ఎక్కువగా ఉన్నా వాటిని నిల్వ చేసుకోక పోవడంతో పూర్తిగా కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు మాత్రం స్థానిక పిక్కలను వేల బస్తాలు కొనుగోలు చేశారు. వారంతా నిర్భయంగా వ్యాపారాన్ని చేసుకుంటున్నారు.

  • పలాస మార్కెట్‌లో ధరలు

  • ------------------------------------

  • జీడి పప్పు రకం - ధర (కిలో)

  • ------------------------------------

  • జేహెచ్‌(బద్ద) - రూ.730-740

  • 180 - రూ.850

  • 210 - రూ.785

  • 240 - రూ.745

  • 320 - రూ.715

  • 400 - రూ.685

  • ఈ ఏడాది నష్టమే

    ఈ ఏడాది అనుకోకుండా విదేశీ జీడి పిక్కలతో తీవ్ర నష్టం ఏర్పడింది. తితలీ తుఫాన్‌ దెబ్బ నుంచి కోలుకుంటున్న జీడి వ్యాపారులకు విదేశీ పిక్కలతో మళ్లీ ఉపద్రవం వచ్చింది. తుఫాన్‌ నష్టం కంటే ఈ నష్టమే అధికంగా ఉంది.

    - మల్లా రామేశ్వరరావు, పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు

    ...................

  • ప్రభుత్వం ఆదుకోవాలి

    నష్టాల నుంచి ప్రభుత్వమే గట్టెక్కించాలి. జీడి పరిశ్రమలను ఆదుకోవాలి. పన్నులు మినహాయిస్తే కొంతవరకూ ఉపశమనం ఉంటుంది.

    - మల్లా సురేష్‌కుమార్‌, జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు

    ......................

  • ధరలు పెరుగుతాయని చూస్తున్నాం

    సంక్రాంతి నాటికి ధరలు పెరుగుతాయని వేచి చూస్తున్నాం. ఇప్పటివరకు తీవ్ర నష్టాల్లో ఉన్నాం. చిన్న వ్యాపారులు ఇప్పటికే కుదేలయ్యారు. పెద్ద వ్యాపారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

    -కేవీ శివకృష్ణ, జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి

Updated Date - Jan 08 , 2025 | 12:02 AM