ప్రజలకోసం పనిచేసేది టీడీపీయే

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:42 PM

అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ టీడీపీయేనని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.సోమవారం ఉర్లాంలో టీడీపీ సభత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

ప్రజలకోసం పనిచేసేది టీడీపీయే
ఉర్లాంలో టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్న రమణమూర్తి :

నరసన్నపేట, మార్చి 31(ఆంఽధ్రజ్యోతి): అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ టీడీపీయేనని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.సోమవారం ఉర్లాంలో టీడీపీ సభత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వం కార్డులే అసలైన గుర్తింపు అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, పార్టీ మండలాధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్‌, జల్లు చంద్రమౌళి, అడపా చంద్రశేఖర్‌, కన్నేపల్లి ప్రసాద్‌, పూతి రమణ, రావాడ కృష్ణ, చమళ్ల వామనమూర్తి, యాగళ్ల విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:42 PM