యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
ABN, Publish Date - Apr 01 , 2025 | 11:57 PM
రాష్ట్రం లో 20లక్షల మంది యువతకు ఉపాధి కల్పిం చడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయు డు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

కోటబొమ్మాళి,ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో 20లక్షల మంది యువతకు ఉపాధి కల్పిం చడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబునాయు డు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవా రం స్థానిక ప్రభుత్వజూనియర్ కళాశాల ప్రాం గణంలో అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయా ల వల్ల పరిశ్రమలు తరలిపోవడమే కాకుండా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదని విమర్శించారు. సాంకేతికంగా వస్తున్న మార్పులను అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధి పెం పొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేదిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఫార్మా రంగానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. దీనివల్ల విద్యతో పాటు ఫార్మా రంగంలో ఉద్యోగావకాశాలు పొందేందుతాయన్నారు. ఈ మెగా జాబ్‌మేళాలో సుమారు 36 సంస్థలు పా ల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా నైపుణ్యా భివృద్ధి సంస్థ అధికారి యు.సాయికుమార్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ నాయకులు వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, పూజారి శైలజ, ఎస్.శ్రీనివాస్, కర్రి అప్పారావు, ప్రిన్సిపాల్ సంతోషి పాల్గొన్నారు.
Updated Date - Apr 01 , 2025 | 11:57 PM