Rice Mill మిల్లు నుంచి ధాన్యం తిప్పి పంపారు
ABN, Publish Date - Jan 01 , 2025 | 11:34 PM
Rice Mill పిన్నింటిపేట ధాన్యం మిల్లు నుంచి తేమశాతం పరిశీలించిన తర్వాత కూడా ధాన్యం తీసుకోకుండా తిరిగి పంపారని ప్రియాగ్రహారం రైతులు బుధవారం ధాన్యం ట్రాక్టర్లతో ఆందోళనకు దిగారు.
పోలాకి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పిన్నింటిపేట ధాన్యం మిల్లు నుంచి తేమశాతం పరిశీలించిన తర్వాత కూడా ధాన్యం తీసుకోకుండా తిరిగి పంపారని ప్రియాగ్రహారం రైతులు బుధవారం ధాన్యం ట్రాక్టర్లతో ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా పంపినప్పటికీ ఎందుకు తిరిగి పంపారని రైతులుతహసీల్దార్ సురేష్‌కుమార్ ను నిలదీశారు. నిబంధనల పేరుతో రైతులను మిల్లర్లు వేధి స్తున్నారని విమర్శించారు. ఈ ఘ టన నేపథ్యంలో తహసీ ల్దార్ స్పందించి మిల్లు యజమానితో మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేయించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
Updated Date - Jan 01 , 2025 | 11:34 PM