ఈవీఎంల భద్రతకు పటిష్ఠ ఏర్పాట్లు

ABN, Publish Date - Mar 27 , 2025 | 11:41 PM

ఈవీఎంల భద్రతకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

ఈవీఎంల భద్రతకు పటిష్ఠ ఏర్పాట్లు
  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 27(ఆంధ్ర జ్యోతి): ఈవీఎంల భద్రతకు పటిష్ఠమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో గల ఈవీఎం గోదాములను వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి గురువారం ఈయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా, క ట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్ని కల నిబంధనల మేరకు మూడు నెలలకో సారి ఈవీఎం గోదాములను తనిఖీ నిర్వ హించడం జరగుతుందన్నారు. ఈవీఎంల ను ట్రిపుల్‌ లాక్‌ పద్ధతిలో భద్రపరచడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధు ల సమక్షంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, సీపీఎం, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన పీంఎజే బాబు, సురేష్‌సింగ్‌ బాబు, రౌతు శంకరరావు, ఎం.గోవింద్‌, బి.అర్జున్‌ కుమార్‌, సీహెచ్‌ భాస్కరరావు, కేవీ ఎల్‌ఎన్‌ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:41 PM