Market : పెద్ద మార్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతాం

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:04 AM

Market development శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌తో కలిసి వారిద్దరూ పెద్దమార్కెట్‌ను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు.

Market : పెద్ద మార్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతాం
కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతున్న కేంద్ర,రాష్ట్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు
  • వ్యాపారులు, ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్మిస్తాం

  • 15 నుంచి వేరొక చోట వ్యాపారాలకు ఏర్పాట్లు

  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు

  • అరసవల్లి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌తో కలిసి వారిద్దరూ పెద్దమార్కెట్‌ను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. ‘ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ మార్కెట్‌ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరాదరణకు గురై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనిని మోడల్‌ మార్కెట్‌గా తీర్చిదిద్దుతాం. నగర అభి వృద్ధిలో భాగంగా ఆమోదయోగ్యంగా నిర్మిస్తాం. అందరికీ వ్యాపారాలు జరిగేలా, ప్రజలు స్వేచ్ఛ గా మార్కెట్‌కు వచ్చి సరుకులు కొనుక్కునేలా సర్వాంగసుందరంగా మార్పుచేస్తాం. సమగ్ర ప్రణాళికతో ‘యు’ ఆకారంలో నిర్మిస్తాం. ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్న వారందరికీ షాపులను కేటాయిస్తాం. ఎవరూ నష్టపోకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. వ్యాపారులతో సమావేశమై వారి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళతాం. ఈ నెల 15 నుంచి మార్కెట్‌ను ఖాళీ చేయాలి. పునర్నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభిస్తాం. నిర్మాణాలు పూర్తయి నంతవరకు వ్యాపారాలు వేరేచోట జరిగేలా చర్యలు తీసుకుంటాం. విశాలమైన పార్కింగ్‌, ఆధునిక గోదాములు, మార్కెట్‌కు అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉం డేలా ప్లాన్‌ చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉంది. పీ-4 వేదికగా నగరంలో నదీతీరంలో పార్కులు, రోడ్లు, డ్రైనేజీలు, కొత్త బస్టాండ్‌, నూతన నగర కార్పొరేషన్‌ కార్యాలయం వంటి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. వాటిని నిర్మాణం చేసి సమస్యలకు తావు లేకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. రథసప్తమి ఉత్సవాల సందర్భంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. వాటిని మరింత ముందుకు తీసుకువెళాతాం. నగరపాలక సంస్థ ఇంజనీర్లు, అధికారులు మార్కెట్‌ నిర్మాణానికి సంబంధించి ప్లాన్‌ను తయారు చేయండి. అలాగే బడ్జెట్‌ కూడా తయారు చేసి మాకు అందజేస్తే తక్షణ చర్యలు ప్రారంభిస్తాం. నగరాన్ని అభివృద్ధి చేయడం మా తొలి ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. జిల్లాకు సరికొత్త రూపునివ్వడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో గల కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, నాయకులు మెండ దాసునాయుడు, కోరాడ హరగోపాల్‌, నవీన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రసాదరావు, ఇంజనీర్‌ పొగిరి సుగుణాకరరావు, నవీన్‌, దుంగ భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:04 AM