ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mughal: మొగలి పరిమళాలు ఏవీ?

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:50 PM

Mogali జిల్లాలో ఈ ఏడాది మొగలి ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఏటా జూన్‌ నుంచి జనవరి వరకూ మొగలి పూలు సేకరిస్తారు. రైతులతోపాటు సేకరించేవారికి కొంత డబ్బులు గిట్టుబాటయ్యేవి.

పెద్దలక్ష్మిపురంలో మొగలి పూల సాగు
  • జిల్లాలో తగ్గిన పూల ఉత్పత్తి

  • అంతంతమాత్రంగానే సేకరణ

  • మూతపడిన పరిశ్రమలు

  • ఇచ్ఛాపురం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది మొగలి ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఏటా జూన్‌ నుంచి జనవరి వరకూ మొగలి పూలు సేకరిస్తారు. రైతులతోపాటు సేకరించేవారికి కొంత డబ్బులు గిట్టుబాటయ్యేవి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా కనీసస్థాయిలో మొగలిపూల సాగు ఆశాజనకంగా లేదు. కనీసస్థాయిలో కూడా సేకరణ లేక తమకు ఉపాధి కరువైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

  • ఇదీ పరిస్థితి..

    జిల్లావ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మొగలి పంట విస్తారంగా ఉండేది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, సంతబొమ్మాళి, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో మొగలి సాగు అధికం. తీర మండలాల్లో దాదాపు 6 వేల హెక్టార్లలో మొగలి సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్దానంలో కొబ్బరి అంతర పంటగా ఎక్కువగా సాగవుతోంది. పొలాలకు కంచె వేసే క్రమంలో మొగలిని నాటుతుంటారు. ఇవి క్రమేపీ పెరుగుతుంటాయి. పొలం గట్లతో పాటు తీర ప్రాంతానికి మొగలి చెట్లు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. అయితే తుఫాన్లకు, ఈదురుగాలులకు ఇవి నేలకొరుగుతున్నాయి. ప్రభుత్వం పంటల జాబితాలో చేర్చకపోవడంతో వీటికి పరిహారం కూడా దక్కడం లేదు. కనీసం రైతులకు సాగు సూచనలు కూడా ఇవ్వడం లేదు.

  • మూతపడుతున్న బట్టీలు..

    ఉద్దానంలో మొగలి పూలు ఎక్కువగా సేకరిస్తుంటారు. అత్తరు, సుగుంధ ద్రవ్యం తయారీలో మొగలి పూలను వినియోగిస్తారు. అందుకే ఉద్దానం వ్యాప్తంగా అప్పట్లో మొగలి నుంచి రసాయనం తీసే పరిశ్రమలు వెలిశాయి. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకొని వందలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. బట్టీలుగా పిలుచుకునే పరిశ్రమల వద్ద భారీ సైజులో ఉండే రాగిపాత్రలో మొగలి పువ్వులు మరిగించి ఆవిరి రూపంలో రసాన్ని తీస్తారు. ఈ రసాన్ని మరో రాగిపాత్రలో నిల్వచేస్తారు. అత్తరు తయారీతో పాటు అగరవత్తుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో మొగలి రసం లీటరు రూ.2లక్షల వరకూ పలుకుతుంది. సీజన్‌లో అయితే రూ.3 లక్షల వరకూ పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. బరంపురం, భువనేశ్వర్‌, జైపూర్‌, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి పువ్వులతో పాటు రసాన్ని కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది సేకరణ లేకపోవడంతో వ్యాపారులు కూడా కనిపించడం లేదు. ఏటా దాదాపు 100 లారీల లోడ్ల వరకూ తరలించగా.. ఈ ఏడాది మాత్రం 30 లోడ్లు కూడా వెళ్లలేదని తెలుస్తోంది.

  • సేకరణ చాలా కష్టం..

    ఏడాదిలో ఆరు నెలలపాటు మొగలి పువ్వులు ఉత్పత్తినిస్తాయి. ఏటా జూన్‌ నుంచి జనవరి వరకూ వీటిని ఎక్కువగా సేకరిస్తారు. ఒక్కోచెట్టుకు వందల్లో పూలు పూస్తాయి. ఒక్కో పువ్వు రూ.10నుంచి రూ.12 వరకూ పలుకుతుంది. అయితే మొగలిపువ్వుల సేకరణ అనేది కత్తిమీద సాము. చెట్టుకొమ్మన పువ్వు పూస్తుంది. మొగలి చెట్లు గుబురుగా ఉంటాయి. పైగా ఆకులకు ముళ్లు ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న రంపం మాదిరిగా దాని ముళ్లు కోస్తాయి. దీనికితోడు మొగలి చెట్లపై పసరిక పాములు సంచరిస్తుంటాయి. మరోవైపు ఉద్దానంలో గుబురుగా ఉండే మొగళి చెట్ల మధ్య ఎలుగుబంట్లు సేదదీరుతుంటాయి. ఇన్ని ప్రమాదాల మధ్య మొగలి పువ్వులు సేకరించినా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు కావడం లేదని రైతులు, కార్మికులు వాపోతున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తున్న మొగలిని వాణిజ్య పంటగా గుర్తించాలని కోరుతున్నారు.

  • ఈ ఏడాది ఉపాధి లేదు..

    ఈ ఏడాది ఉపాధి లేకుండా పోయింది. కనీస స్థాయిలో కూడా ఉత్పత్తి లేదు. వర్షాభావ పరిస్థితులతో మొగలి పువ్వులు దొరకలేదు. ఏటా వంద లారీలోడ్లకుపైగా కవిటి, కంచిలి నుంచి వెళ్లేవి. కానీ ఈ ఏడాది 30 లోడ్లులోపే వెళ్లాయి.

    - పులకల రామారావు, పెద్దలక్ష్మిపురం, మొగలి రైతు

Updated Date - Jan 13 , 2025 | 11:50 PM