ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Officials క్షేత్రస్థాయిలో అధికారులేం చేస్తున్నారు?

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:05 AM

Officials రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి ఎక్కువ సంఖ్యలో వినతులు వచ్చాయి. అలాగే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రసెల్‌ సిస్టమ్‌ ద్వారా కూడా అనేకం వచ్చాయి. అయితే వాటి పరి ష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీఆ ర్వోలు, విలేజీ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్ర హం వ్యక్తంచేశారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్రహం

టెక్కలి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి ఎక్కువ సంఖ్యలో వినతులు వచ్చాయి. అలాగే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రసెల్‌ సిస్టమ్‌ ద్వారా కూడా అనేకం వచ్చాయి. అయితే వాటి పరి ష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీఆ ర్వోలు, విలేజీ సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆగ్ర హం వ్యక్తంచేశారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్ల రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారం లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. టెక్కలి మండలం చాకిపల్లి, మేఘవరం రెవె న్యూ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ విరుచుకుపడ్డారు. మీరు మారరంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్కలి, మెళియాపుట్టి, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, హిర మండలం మండలాల రెవెన్యూ అధికారుల పనితీరును మెరుగుపరుచు కోవాలన్నారు. పలు మండలాల్లో వీ ఆర్వోలు నెలల తరబడి సెలవులో ఉన్నారని, వారు ఎం దుకు సెలవుల్లో ఉన్నారని ఆయా తహసీల్దార్లను కలెక్టర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, మైనర్‌ లిటిగేషన్స్‌, డి.పట్టా ఎసైన్డ్‌ భూములు అర్జీలు పరి ష్కారం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని, జాప్యం వీడాలన్నారు. లక్ష్యాలు అధిగమిం చాలని, వెనుకబడితే సహించేది లేదని హెచ్చరించారు. టెక్కలిలో అద్దె భవనాల్లో ఉన్న శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఏయే శాఖలకు భవనాలు అవసరమో ఆరా తీశా రు. అద్దెలు వేలకు వేలు చెల్లించే కంటే ఖాళీగా ఉన్న పాత జిల్లా కేంద్ర ఆసుపత్రి భవనా ల్లోకి ఆయా శాఖల కార్యాలయాలు మార్చాలని పలు శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో డీఆ ర్వో ఎం.వెంకటేశ్వరరావు, టెక్కలి, పలాస ఆర్డీవోలు ఎం. కృష్ణమూర్తి, జి.వెంకటేష్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లావణ్య, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:05 AM