ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా: ఎమ్మెల్యే ఎంజీఆర్‌

ABN, Publish Date - Apr 16 , 2025 | 12:06 AM

నేను మీ సేవకుడిని.. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): నేను మీ సేవకుడిని.. అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక సీపీరోడ్‌ నుంచి చంగుడి మీదుగా మాకనాపల్లి కూడలి వరకు రూ. 3.05 కోట్ల ఉపాధి నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎక్స్‌కవేటర్‌తో పనులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మూడున్నర దశాబ్దాల సమస్యకు పరి ష్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి పరు గులు తీస్తోందన్నారు. రూ.450 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పీఆర్‌ డీఈ ప్రసాదరావు తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌, టీడీపీ నేతలు నందిగామ ఆనందరావు పైల బాబ్జీ, సైలాడ సతీష్‌, టి.తిరుపతిరావు, మడ్డు రామారావు తదితరులు పాల్గొన్నారు.

కుడికాలువ పనులు పూర్తి చేయండి

పాతపట్నం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వంశధార కుడి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాల యంలో మంగళవారం వంశధార అధికారు లతో సమీక్షించారు. ప్రాజెక్ట్‌ ఆధునికీకరణ పనుల కోసం ఇప్పటికే రూ.1.75 కోట్లు ఉపాధి నిధులు మంజూరు చేయడం జరిగిం దన్నారు. రానున్న ఖరీఫ్‌ నాటికి శివారు ప్రాంతాలకు సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గండ్లు పూడ్చడం, పూడి కతీత, రక్షణ గోడల నిర్మాణం, మర మ్మతు పనులు చేయించాలన్నారు. ఈఈ ఎంవీ రమణ, డీఈ సురేష్‌ కుమార్‌, జేఈలు శ్రీనివాస్‌, సోమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:06 AM