ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drunk and Drive: వారిలో మార్పు వస్తుందా?

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:12 AM

Alcohol consumption రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. కొందరు మందుబాబుల తీరు మారడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మంది 25 ఏళ్ల లోపు యువకులే మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. గాయపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

  • మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వైనం

  • అధికశాతం రోడ్డు ప్రమాదాలకు వారే కారణం

  • అవగాహన కల్పిస్తున్న పోలీసులు.. విస్తృత తనిఖీలు

    శ్రీకాకుళం క్రైం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. కొందరు మందుబాబుల తీరు మారడం లేదు. రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మంది 25 ఏళ్ల లోపు యువకులే మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. గాయపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆపై జైలు శిక్ష విధిస్తున్నా సరే మద్యం తాగి వాహనం నడుపుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మరింత విస్తృతంగా వాహన తనిఖీలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

  • జిల్లాలో గతేడాది సుమారు 900 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 282 మంది మరణించారు. వీటిలో అధిక శాతం ప్రమాదాలు.. వాహన చోదకులు మద్యం తాగి వాహనాలు నడపడమే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల పేరుతో పోలీసులు బ్రీత్‌ అనలైజర్లతో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదట్లో వాహనాలను సీజ్‌ చేసి జరిమానా విధించేవారు. దీనివల్ల మందుబాబుల తీరులో ఎటువంటి మార్పు రాకపోవడంతో తమ పంఽథా మార్చారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానా విధించి వదిలేయకుండా కోర్టులో హాజరుపరచడం ప్రారంభించారు. కోర్టు విచారణ జరిపి మొదటిసారి పట్టుబడిన వారికి రూ.150 నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తుంది. రెండోసారి పట్టుబడితే జైలు శిక్ష విధించడం ఖాయం. దీని వల్ల మందుబాబుల తీరులో మార్పు వస్తుందని న్యాయస్థానంతో పాటు పోలీసు శాఖ భావిస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

  • 2023లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2,635 మందిపై కేసులు నమోదు చేశారు. 2024లో 3,282 మందిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి 20 రోజుల సాధారణ జైలు శిక్షను కోర్టు విధించింది. వీరిలో ముగ్గురు రౌడీషీటర్లు కూడా ఉన్నారు.

  • విస్తృత తనిఖీలు చేపడుతున్నాం

    కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు విస్తృతంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మందుబాబుల్లో మార్పు కోసం తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరుస్తున్నాం. కొంతమందికి జైలు శిక్ష కూడా పడుతోంది. ప్రశాంతమైన సమాజానికి ప్రజలు సహకరించాలి. యువకుల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. వారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాలి. డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లో పట్టుబడిన యువకులతో వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో అవగాహన కల్పిస్తున్నాం. ఇకపై మద్యం సేవించి వాహనాలు నడిపే యువకుల తల్లిదండ్రులపై కూడా కేసులు పెడతాం.

    - కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ

Updated Date - Jan 11 , 2025 | 12:12 AM