టాలెంట్‌ టెస్టులో స్టేట్‌ ర్యాంకులు

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:10 AM

ఎడ్యుకేషన ఎపిఫని మెరిట్‌ టాలెంట్‌ టెస్టులో స్టేట్‌ మొదటి ర్యాంకులను ధర్మవరం బీఎస్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించినట్టు ఆ పాఠశాల హెచఎం రాంప్రసాద్‌ తెలిపారు

 టాలెంట్‌ టెస్టులో స్టేట్‌ ర్యాంకులు
మెమెంటో, సర్టిఫికెట్‌ అందుకొంటున్న ధర్మవరం విద్యార్థి

ధర్మవరం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఎడ్యుకేషన ఎపిఫని మెరిట్‌ టాలెంట్‌ టెస్టులో స్టేట్‌ మొదటి ర్యాంకులను ధర్మవరం బీఎస్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించినట్టు ఆ పాఠశాల హెచఎం రాంప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఆనలైన విధానంలో జరిగిన ఎడ్యుకేషన ఎపిఫని మెరిట్‌ టెస్టు -2025 (ఈఈఎంటీ)లో తమ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి దాసరి లలితేష్‌, 8వతరగతి విద్యార్థి ఉక్కిసిల ఓబుళేశు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించారన్నారు. శనివారం విజయవాడలో జరిగిన ర్యాంకుల ప్రదాన సభలో వీరికి రాష్ట్ర సీమాట్‌ డైరెక్టర్‌ మస్తానయ్య, కోడ్‌ తంత్ర అధినేత రమణ చేతులమీదుగా మెమెంటో, సర్టిఫికెట్‌, రూ.30వేల చెక్కులు అందుకున్నట్టు పాఠశాల హెచఎం తెలిపారు.

Updated Date - Feb 10 , 2025 | 12:10 AM