ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మా మంచి మేడమ్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 02:19 AM

తమను విడిచి వెళ్లొద్దంటూ చుట్టూ చేరి విద్యార్థుల రోదనలు.. వారిని సముదాయించలేక ఉపాధ్యాయిని కంట నీరు.. విజయనగరం జిల్లా రామభద్రపురం పూడివీధి ఎలిమెంటరీ పాఠశాలలో బుధవారం కనిపించిన దృశ్యమిది.

విడిచి వెళ్లొద్దంటూ విద్యార్థుల కన్నీళ్లు

రిటైరైనా వచ్చి బాగోగులు చూస్తానంటూ ఓదార్పు

రామభద్రపురం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): తమను విడిచి వెళ్లొద్దంటూ చుట్టూ చేరి విద్యార్థుల రోదనలు.. వారిని సముదాయించలేక ఉపాధ్యాయిని కంట నీరు.. విజయనగరం జిల్లా రామభద్రపురం పూడివీధి ఎలిమెంటరీ పాఠశాలలో బుధవారం కనిపించిన దృశ్యమిది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.విజయగౌరి ఈ ఏడాది మార్చిలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఆమె బుధవారం పాఠశాల నుంచి వెళ్తుండగా విద్యార్థులు తమను విడిచి వెళ్లొద్దంటూ వేడుకున్నారు. ఆ చిన్నారుల కన్నీరు చూసి ఆమె కూడా దుఃఖం ఆపుకోలేకపోయారు. రిటైరైనా పాఠశాలకు వచ్చి బాగోగులు చూసుకుంటానంటూ విద్యార్థులను ఓదార్చారు. విజయగౌరి 2023 జూన్‌ నుంచి ఈ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. తన 33 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పనిచేసినా విద్యతోపాటు సాంస్కృతిక, చిత్ర లేఖనం, క్రీడా పోటీల్లో విద్యార్థులను బాగా ప్రోత్సహించేవారు. జాతీయ పండగలప్పుడు పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం, ఆకలితో వచ్చిన విద్యార్థులకు తన సొంత డబ్బుతో అల్పాహారం తెప్పించి పెట్టడం, వారి అభిరుచులకు అనుగుణంగా ప్రాజక్టులు చేయించడం తదితరాల వల్ల ఆమెతో విద్యార్థులకు అనుబంధం పెరిగింది. అందుకే ఆమె పాఠశాలను విడిచి వెళ్తుంటే విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

Updated Date - Jan 02 , 2025 | 02:19 AM