Deepak Reddy: ముస్లింల గొంతు కోసిన వైసీపీ
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:47 AM
వక్ఫ్ బిల్లులో ముస్లింల హక్కుల కోసం మూడు సవరణలు ప్రతిపాదించిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. వైసీపీ మతం పేరుతో ముస్లింలను మోసగించిందని ఆరోపిస్తూ, ముస్లిం నేతలంతా ఆ పార్టీని వీడాలని ఆయన పిలుపునిచ్చారు.

అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ముస్లింల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. వక్ఫ్ బిల్లులో ముస్లింల హక్కుల కోసం మూడు సవరణలను ప్రతిపాదించిన ఒకే ఒక్క పార్టీ టీడీపీ. వైసీపీ ముస్లింలను నమ్మించి గొంతుకోసింది. గతంలో సీఏఏకు అనుకూలంగా ఓటేసిన జగన్... నేడు వక్ఫ్ బిల్లుపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ద్వంద్వ వైఖరి అవలంభించారు. వైసీపీపై ముస్లింలు తిరుగుబాటు చేయాలి. వైసీపీలోని ముస్లిం నేతలంతా ఆ పార్టీని వీడాలి’ అని దీపక్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News