ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: బాధాకరమైన ఘటన!

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:12 AM

తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. అలాగే... వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా స్వీకరించాలని నిర్ణయించింది.

‘సారీ’పై సారీ! బేషరతు క్షమాపణ చెప్పిన చైర్మన్‌

ఇలా జరగకుండా ఉండాల్సింది

చిన్న పొరపాటుతో పెద్ద విషాదం

మృతుల కుటుంబాలకు 25 లక్షల సాయం

పిల్లల చదువులు, కుటుంబంలో ఒకరికి

ఉద్యోగం.. క్షతగాత్రులకూ పరిహారం

టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానాలు

తిరుమల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. అలాగే... వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా స్వీకరించాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో నియామకాలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించింది. శుక్రవారం తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశం అనంతరం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, గాయపడిన మరో 31 మందికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. ‘‘పరిహారం చెక్‌లను సిద్ధం చేశాం. వాటిని బోర్డు సభ్యులు, స్థానిక మంత్రులతో కలిసి రెండుమూడు రోజుల్లో బాధితులకు అందజేస్తారు’’ అని తెలిపారు.

బాధాకరం... ‘‘ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలా జరగకుండా ఉండాల్సింది. చిన్నచిన్న పొరపాట్ల కారణంగా పెద్ద ఘటన చోటుచేసుకుంది’’ అని బీఆర్‌ నాయుడు విచారం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం జుడీషియల్‌ విచారణకు ఆదేశించారని.. బాఽధ్యులు ఎంత పెద్దవారైనా తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. టోకెన్ల జారీ కేంద్రాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇబ్బంది జరిగింది. 13వ తేదీ నుంచి ఏరోజు టోకెన్లు ఆ రోజే జారీ చేస్తాం’’ అని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలపై బోర్డులో చర్చించి, ఆగమశాస్త్ర పండితుల సలహాల మేరకు మార్పులు చేస్తామని బీఆర్‌ నాయుడు చెప్పారు. మరోవైపు... బాధితులకు తమ వంతు సహాయంగా బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, సుచిత్రా ఎల్లా చెరో రూ.10 లక్షలు అందిస్తామని చెప్పారు. సభ్యుడు ఎంఎస్‌ రాజు రూ.3 లక్షల చెక్కును బోర్డు చైర్మన్‌కు అందించారు.

Updated Date - Jan 11 , 2025 | 04:12 AM