ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati Stampede: మృతుల ఇంటికి పాలక మండలి సభ్యులు.

ABN, Publish Date - Jan 10 , 2025 | 06:46 PM

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మొత్తాన్ని మృతుల కుటుంబ సభ్యులకు టీటీడీ సభ్యులు స్వయంగా వెళ్లి అందజేస్తారని చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

TTD Chairman BR Naidu

తిరుపతి, జనవరి 10: తిరుపతి, జనవరి 10: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం టోకెన్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న పోరపాట్లు జరిగిన మాట వాస్తవమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. మృతుల కుటుంబాల్లో ఒకరి టీటీడీలో ఉద్యోగ ఇస్తామన్నారు.

అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లలకు టీటీడీ తరఫున ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆయన గుర్తు చేశారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి అత్యవసర సమావేశమైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విలేకర్ల సమావేశంలో వివరించారు.

ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. మరణించిన వారికి రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడని వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ నగదును స్వయంగా పాలక మండలి సభ్యులు... మృతుల కుటుంబ సభ్యులకు అందజేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.


సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇకపరై తిరుపతిలో సర్వ దర్శన టోకెన్లు ఏ రోజుకారోజు కేటాయిస్తాని ప్రకటించారు. అయితే క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని... కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావని చైర్మన్‌ బీఆర్ నాయుడు తమదైన శైలిలో స్పందించారు. టికెట్ల జారీ కోసం చేసిన ఏర్పాట్లలో మాత్రం లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి 15 మంది సభ్యులు హాజరయ్యారు.

Also Read: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు

Also Read: బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది

Also Read: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం


మరోవైపు.. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై గురువారం ఆయన తిరుపతిలో క్షమాపణలు చెప్పారు. ఇక ఈ ఘటన టీటీడీ చైర్మన్, ఈవోల వైఫల్యం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. వీరు.. క్షమాపణలు చెప్పాలని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అయిన తానే క్షమాపణలు చెప్పినప్పుడు.. వీరిద్దరు క్షమాపణలు చెప్పడానికి వచ్చిన నామోషీ ఏమిటంటూ పిఠాపురంలో పవన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అలాగే మృతుల కుటుంబాలకు ఇంటికి టీటీడీ పాలక మండలి సభ్యులు స్వయంగా వెళ్లాలంటూ.. పవన్ సూచించిన విషయం విధితమే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో.. టీటీడీ పాలక మండలి అత్యసవరంగా సమావేశమైందనే ఓ చర్చ సైతం సాగుతోంది.

Also Read: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది

Also Read: టీటీడీ చైర్మన్‌, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 07:05 PM