ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

ABN, Publish Date - Jan 13 , 2025 | 03:22 AM

ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని అక్కడి నాగవాసుకి ఆలయ సమీపంలో ఆదివారం ప్రారంభించారు.

తిరుమల, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం నుంచి మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని అక్కడి నాగవాసుకి ఆలయ సమీపంలో ఆదివారం ప్రారంభించారు. నమూన ఆలయాన్ని ఇంజినీరింగ్‌ నిపుణులు, టీటీడీ సిబ్బంది శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలో శ్రీవారి వైభవాన్ని తెలియజేసేందుకు నమూనా ఆలయాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. కుంభమేళాకు వచ్చే భక్తులందరూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆదివారం తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లను త్రివేణి సంగమం చెంతకు తీసుకెళ్లి గంగా జలాలను కలశంలో నింపుకొన్నారు. ఆ నీటిని నమూనా ఆలయానికి తీసుకువచ్చి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలో విష్వక్సేన పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు.

Updated Date - Jan 13 , 2025 | 03:22 AM