ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

431 కిలోల గంజాయి పట్టివేత

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:13 PM

ముంచంగిపుట్టు మండలం నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్న 431 కిలోల గంజాయిని శనివారం మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ సంపంగిపుట్టు జంక్షన్‌ వద్ద పట్టుకున్నట్టు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు.

సంపంగిపుట్టు జంక్షన్‌ వద్ద పట్టుబడిన గంజాయి నిందితులతో ఎస్‌ఐ రమణ సిబ్బంది

ఒకరి అరెస్టు, బొలేరో వాహనం సీజ్‌

పెదబయలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ముంచంగిపుట్టు మండలం నుంచి ఒడిశాకు రవాణా చేస్తున్న 431 కిలోల గంజాయిని శనివారం మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ సంపంగిపుట్టు జంక్షన్‌ వద్ద పట్టుకున్నట్టు ఎస్‌ఐ కొల్లి రమణ తెలిపారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు సంపంగిపుట్టు జంక్షన్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కుజబంగి వైపు నుంచి వస్తున్న బొలేరోను ఆపి పరిశీలించగా బస్తాల్లో గంజాయిని గుర్తించామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 431 కిలోలు ఉందన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.22 లక్షలు ఉంటుందన్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ బ్లాక్‌ పరాజబదపడ పంచాయతీ శ్రీగుమ్‌పుట్‌ గ్రామానికి చెందిన శిబింద్ర హంతల్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు. అతనిపై ఎన్‌డీపీఎస్‌ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన బొలేరో వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 10:13 PM