ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లోయలో సిమెంట్‌ లారీ బోల్తా

ABN, Publish Date - Jan 12 , 2025 | 10:56 PM

సిమెంట్‌ లోడ్‌తో దిబ్బపాలెం సమీపంలో ఘాటీ ఎక్కుతున్న లారీ అదుపుతప్పి లోయలో పడడంతో డ్రైవర్‌ మృతి చెందాడు.

లోయలో బోల్తా పడిన సిమెంట్‌ లారీ

డ్రైవర్‌ మృతి

అనంతగిరి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సిమెంట్‌ లోడ్‌తో దిబ్బపాలెం సమీపంలో ఘాటీ ఎక్కుతున్న లారీ అదుపుతప్పి లోయలో పడడంతో డ్రైవర్‌ మృతి చెందాడు. దీనికి సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. రాజమహేంద్రవరంలోని బషీర్‌ ట్రాన్స్‌పోర్టులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న పిట్టకోట పుత్రయ్య బయ్యవరం నుంచి పినకోట పంచాయతీకి సిమెంట్‌ లోడుతో ఆదివారం ఉదయం బయలుదేరాడు. జీనబాడు గ్రామం దాటిన తరువాత దిబ్బపాలెం సమీపంలో గల ఘాటీ వద్దకు వచ్చేసరికి లారీ ఒక్కసారిగా పికప్‌ అందుకోకపోవడంతో వెనక్కి జారుకుంటూ లోయలో బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ పుత్రయ్య క్యాబిన్‌లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై మృతుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

Updated Date - Jan 12 , 2025 | 10:56 PM