ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లె రోడ్లకు కొత్త రూపు

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:55 AM

గ్రామీణ ప్రాంతాలకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. ఏళ్ల తరబడి అధ్వానంగా ఉన్న గ్రామీణ రహదారులు కూటమి ప్రభుత్వం పుణ్యమా అని బాగుపడుతున్నాయి. సంక్రాంతి పండుగనాటికి గుంతలు లేని రోడ్లు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీంతో జిల్లాలో రహదారుల నిర్వహణ, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పూడ్చడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో (60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం) గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు.

గొలుగొండ మండలం ఏటిగైరంపేటలో నిర్మించిన సీసీ రోడ్డు

గ్రామాల్లో చకచకా సిమెంట్‌ రహదారుల నిర్మాణం

ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పూడ్చివేత

సంక్రాంతి పండుగనాటికి పనులు పూర్తి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంతాలకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. ఏళ్ల తరబడి అధ్వానంగా ఉన్న గ్రామీణ రహదారులు కూటమి ప్రభుత్వం పుణ్యమా అని బాగుపడుతున్నాయి. సంక్రాంతి పండుగనాటికి గుంతలు లేని రోడ్లు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. దీంతో జిల్లాలో రహదారుల నిర్వహణ, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పూడ్చడంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో (60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం) గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. వివిధ గ్రామాల్లో 148 కిలోమీటర్ల పొడవున సిమెంట్‌ రోడ్లు వేసేందుకు ప్రభుత్వం 1,372 పనులు మంజూరు చేసింది. ఇప్పటికే 1,102 పనులు ప్రారంభమయ్యాయి. పలు గ్రామాల్లో సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటి వరకు సిమెంట్‌ రోడ్ల పనులకు రూ.11 కోట్లు ఖర్చు చేశామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. గతంలో మంజూరైన రోడ్ల పనులను త్వరగా పూర్తి చేసి, కొత్తగా మరిన్ని రోడ్లు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 12:55 AM