ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చురుగ్గా రోడ్డు నిర్మాణం

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:15 AM

మండలంలోని తుని-నర్సీపట్నం మార్గంలో శృంగవరం-గన్నవరంమెట్ట మధ్య రహదారి అభివృద్ధి పనులు సగానికిపైగా పూర్తయ్యాయి. మన్యపురట్ల సెంటర్‌ సమీపంలో సీసీ రోడ్డుతోపాటు మిగిలిన చోట్ల తారు రోడ్డులో ఒక లేయర్‌ వేయడం పూర్తయ్యింది. ఇంకా వంతెనలు, కల్వర్టులు, బీటీ చివరి లేయర్‌పనులు చేపట్టాల్సి వుంది.

ఎ.శరభవరం వద్ద ఒక లేయర్‌ పూర్తయిన తారురోడ్డు

శృంగవరం-గన్నవరంమెట్ట మధ్య సగానికిపైగా పనులు పూర్తి

మన్యపురట్ల సెంటర్‌ సమీపంలో సీసీ రోడ్డు

మిగిలిన చోట్ల బీటీ మొదటి లేయర్‌

త్వరలో కల్వర్టులు, వంతెనలతోపాటు తారు రోడ్డు రెండో లేయర్‌ పనులు

నాతవరం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుని-నర్సీపట్నం మార్గంలో శృంగవరం-గన్నవరంమెట్ట మధ్య రహదారి అభివృద్ధి పనులు సగానికిపైగా పూర్తయ్యాయి. మన్యపురట్ల సెంటర్‌ సమీపంలో సీసీ రోడ్డుతోపాటు మిగిలిన చోట్ల తారు రోడ్డులో ఒక లేయర్‌ వేయడం పూర్తయ్యింది. ఇంకా వంతెనలు, కల్వర్టులు, బీటీ చివరి లేయర్‌పనులు చేపట్టాల్సి వుంది.

తుని-నర్సీపట్నం మార్గంలో శృంగవరం-గన్నవరంమెట్ట మధ్య 4.3 కిలోమీటర్ల మేర రోడ్డు మొత్తం ఛిద్రమై అధ్వానంగా ఉండడంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పందించి గత ఏడాది డిసెంబరులో నిధులు మంజూరు చేయించారు. రూ.14 కోట్ల న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు గ్రాంటుతో పదిచోట్ల కల్వర్టులు, రెండుచోట్ల వంతెనల నిర్మాణం, మన్యపురట్ల సెంటర్‌ సమీపంలో సీసీ రోడ్డు, మిగిలిన చోట్ల తారు రోడ్డు వేస్తారు. జనవరిలో పనులు మొదలుపెట్టారు. భారీ గోతులు మొత్తం పూడ్చివేశారు. మన్యపురట్ల సెంటర్‌ సమీపంలో చిత్తడి నేల కావడంతో తారు రోడ్డు వేసినా ఫలితం ఉండదన్న ఉద్దేశంతో ఇక్కడ సీమెంట్‌ కాంక్రీట్‌ రోడ్డు వేశారు. మిగిలినచోట్ల బీటీ రోడ్డు మొదటి లేయర్‌ పనులు పూర్తయ్యాయి. ఇంతవరకు అయిన పనులకు బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. ఇటీవల వరకు ఆర్థిక సంవత్సరం చివరినెల కావడంతో బిల్లులు క్లియర్‌ కాలేదు. ఈ నెలలో బిల్లులు మంజూరు అవుతాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులు విడుదలైన వెంటనే కల్వర్టులు, వంతెనల నిర్మాణంతోపాటు రెండో విడద బీటీ లేయర్‌ పనులు మొదలుపెడతామని పేర్కొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 12:15 AM