నేటి నుంచి ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:40 AM
డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం వీఎంఆర్‌డీఏ చిల్రన్ ఎరీనాలో జరగనుంది.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):
డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం వీఎంఆర్‌డీఏ చిల్రన్ ఎరీనాలో జరగనుంది. రెండు రోజులు నిర్వహించే ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సదస్సులో ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎలక్ర్టానిక్స్, స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ టెక్నాలజీ, మెడికల్ అండ్ హెల్త్ టెక్నాలజీ, క్రియేటివ్ టెక్నాలజీలపై చర్చలు జరుగుతాయని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్‌షిప్ ఫోరమ్ కన్వీనర్ శ్రీధర్ కొసరాజు తెలిపారు.
Updated Date - Jan 08 , 2025 | 12:40 AM