ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కైలాసగిరిపై బ్యాటర్లీ కార్ల దోపిడీ

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:59 AM

విశాఖ మహా నగర ప్రాంత సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిర్వహణలో ఉన్న కైలాసగిరిని కొందరు ఆదాయ వనరుగా మార్చుకొని లబ్ధి పొందుతున్నారు.

  • మనిషికి టిక్కెట్‌ రూ.50,

  • ఒక్కో వాహన నిర్వాహకుడు

  • వీఎంఆర్‌డీఏకి ఇచ్చేది మాత్రం నెలకు కేవలం రూ.10 వేలు

  • భారీగా ఆదాయం కోల్పోతున్న సంస్థ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిర్వహణలో ఉన్న కైలాసగిరిని కొందరు ఆదాయ వనరుగా మార్చుకొని లబ్ధి పొందుతున్నారు. దిగువ స్థాయి సిబ్బందితో కుమ్మక్కై సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు.

కైలాసగిరి వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు అంతా చూడాలంటే కాలినడకన వెళ్లలేకపోతున్నారు. దీనిని దళారులు ఆదాయంగా మార్చుకున్నారు. ముందుగా అక్కడ ఈ సమస్య ఉందని, వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఉపయోగపడేలా బ్యాటరీ కార్లు నిర్వహిస్తే బాగుంటుందనే వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లేలా చేశారు. అదే సమయంలో పలువురు ప్రజా ప్రతినిధులతో ఫోన్లు చేయించి, బ్యాటరీ కార్లను పెట్టే ఆలోచన ఉంటే తమ వారికి అవకాశం ఇవ్వాలంటూ చెప్పించుకున్నారు. ఆ వెంటనే బ్యాటరీ కార్లను నడుపుతామని, వీఎంఆర్‌డీఏకు నెలకు రూ.10 వేలు ఆదాయం ఇస్తామంటూ కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఇది పర్యాటక సీజన్‌, పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో అధికారులు వాటికి ఆమోదం తెలిపారు. ప్రతి నెలా రూ.10 వేలతో పాటు జీఎస్‌టీ చెల్లించాలని, ఇంకా మరికొన్ని నిబంధనలు పెడుతూ బి.నూకేశ్వరరావు, కె.రాజశేఖర్‌ అనే వారికి చెరో బ్యాటరీ కారు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. గత నెల అంటే డిసెంబరు 5న అనుమతులు ఇచ్చారు. ఆ వెంటనే వారు రంగంలో దిగిపోయారు. బ్యాటరీ కారులో ఒకేసారి ఆరు నుంచి ఎనిమిది మంది వెళ్లేలా నడుపుతున్నారు. దీనికి ఒక్కొక్కరి నుంచి రూ.50 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు నాలుగైదు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. వారికి ఖర్చులు, వీఎంఆర్‌డీఏకి ఇవ్వాల్సిన మొత్తం వారం రోజుల్లోనే వస్తుండగా, మిగిలిన మూడు వారాల సొమ్ము మిగులుతోంది. వీఎంఆర్‌డీఏ సొంతంగా బ్యాటరీ కార్లు నడిపితే ఆ ఆదాయం అంతా సంస్థకే వస్తుంది. లేదంటే వేలం వేసి ఇచ్చినట్టయితే పోటీ వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది.

వేలం వేయాలని డిమాండ్‌

కైలాసగిరిపై బ్యాటరీ కార్ల వల్ల వీఎంఆర్‌డీఏ ఆదాయం కోల్పోతున్నదని, వాటికి వేలం వేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులను జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ కోరారు. ప్రస్తుతం అనుమతి పొందిన వారిలో ఒకరు బ్యాటరీ కారు నడపడం లేదని కూడా ఆరోపించారు.

షోకాజ్‌ నోటీసుల జారీ

విశ్వనాథన్‌, కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ

బ్యాటరీ కార్లు నడపడానికి అనుమతి తీసుకున్న వారికి ప్రస్తుతం షోకాజ్‌ నోటీసు జారీ చేశాము. వారి నుంచి వివరణ తీసుకుంటాము. ఆదాయ వివరాలు పూర్తిగా తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకుంటాము.

Updated Date - Jan 11 , 2025 | 12:59 AM