ఘనంగా భోగి పండుగ
ABN, Publish Date - Jan 13 , 2025 | 11:25 PM
జిల్లాలోని ప్రజలు భోగి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వాడవాడలా తెల్లవారుజామున భోగి మంటలతో పెద్ద పండుగకు శ్రీకారం చుట్టారు.
వాడవాడలా సందడి
పాడేరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రజలు భోగి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. వాడవాడలా తెల్లవారుజామున భోగి మంటలతో పెద్ద పండుగకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా పాడేరు, అరకులోయ, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు, మోతుగూడెం, డొంకరాయి ప్రాంతాల్లో భోగిని వైభవంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా భోగి మంటలు వేయడం, అక్కడే నీళ్లను కాచుకుని వాటితోనే స్నానాలను ఆచరించడం వంటి దృశ్యాలు గ్రామాల్లో కనిపించాయి. పాడేరులోని మెయిన్‌రోడ్డు, గుడివాడ వీధి, ఇందిరానగర్ ప్రాంతాల్లో పెద్ద దుంగలతో భారీ స్థాయి భోగి మంటలను వేశారు. ఆయా భోగి మంటల్లో గ్రామాల్లో వృథాగా ఉన్న పాత వస్తువులు, చెక్క ముక్కలను వేశారు. మండల కేంద్రాలతో పాటు పంచాయతీ, గ్రామ స్థాయిలోనూ భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.
Updated Date - Jan 13 , 2025 | 11:25 PM